Horwin Senmenti EV Scooty: సింగిల్ చార్జ్‪తో 300 కి.మీ.. కార్ల మాదిరిగా కెమెరా, సెన్సార్లు.. ఇది స్కూటర్ కాదు అంతకుమించి..

మీరు ఒకవేళ కొత్త స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే దీనిలో అత్యాధునిక ఫీచర్లు, భద్రతకు ప్రాధాన్యమిస్తూ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అంతేకాక సింగిల్ చార్జ్ పై 300 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

Horwin Senmenti EV Scooty: సింగిల్ చార్జ్‪తో 300 కి.మీ.. కార్ల మాదిరిగా కెమెరా, సెన్సార్లు.. ఇది స్కూటర్ కాదు అంతకుమించి..
Horwin Senmenti
Follow us
Madhu

|

Updated on: Mar 06, 2023 | 3:35 PM

ఇది డిజిటల్ యుగం.. అంతా ఎలక్ట్రానిక్ రూపంలోనే వస్తున్నాయి. ఇదే క్రమంలో వాహనాలు కూడా కొత్త కొత్త ఎలక్ట్రానిక్ ఫీచర్లతో రావడం అనివార్యమవుతోంది. ముఖ్యంగా విద్యుత్ శ్రేణి వాహనాల్లో ఫీచర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో డిజిటల్ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌ లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో ఈ శ్రేణిలో ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఓలా, హోండా యాక్టివా వంటి కంపెనీలు పోటీగా హార్విన్ సెన్మెంటి ఎలక్ట్రానిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీరు ఒకవేళ కొత్త స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే దీనిలో అత్యాధునిక ఫీచర్లు, భద్రతకు ప్రాధాన్యమిస్తూ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అంతేకాక ప్రస్తుతం ఎలక్ట్రికల్ స్కూటర్లలో అత్యధిక మైలేజీని దాదాపు సింగిల్ చార్జ్ పై 300 కిలోమీటర్లు రేంజ్ ని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

అల్ట్రా రేంజ్‌..

హార్విన్ సెన్మెంటి ఎలక్ట్రానిక్ స్కూటర్.. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక సాంకేతికతతో వస్తోంది. దీనిలోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. మీరు ఎక్కువ దూరం ప్రయాణించే స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, ఇతర కంపెనీలతో పోల్చితే ఈ స్కూటర్ తక్కువ ధరకే మంచి రేంజ్‌ను అందిస్తోంది.

ప్రత్యేక ఫీచర్లు..

హార్విన్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్ ప్రత్యేకమైన డిజిటల్ ఫీచర్లను అందిస్తుంది. అంతేకాక భద్రతకు అధిక ప్రాధన్యమిస్తూ సమీపంలోని వస్తువులను గుర్తించగల కెమెరాను ఇందులో అమర్చారు. దూర ప్రాంతాలకు ప్రయాణించాలనుకుంటే ఇదే మీకు బెస్ట్ స్కూటర్. ఎందుకంటే ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

ఇవి కూడా చదవండి

సెన్సార్లు..

ప్రత్యేకమైన డిజిటల్ ఫీచర్లతో ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్‌ను రూపొందించారు. అందుకోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఆటోమేటిక్ డిటెక్షన్ కోసం 30 కంటే ఎక్కువ సెన్సార్లను ఉపయోగించారు. ఇతర కంపెనీలతో పోల్చితే ఎక్కువ రేంజ్ లైట్లను కలిగి ఉంది. ఇది రాత్రిపూట మరింత ప్రకాశవంతమైన రైడ్ ని మీకు అందిస్తుంది.

అందుబాటు ధరలోనే..

ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్ల ధరను తయారీదారులు ఇంకా వెల్లడించలేదు, అయితే ఇది దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని డిజిటల్ ఫీచర్ల ప్రకారం, ఈ స్కూటర్ ధర దాదాపు రూ. 115,000(ఆన్ రోడ్) ఉండే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!