Electric Scooter: కిర్రాక్ లుక్లో కార్గో స్కూటర్.. 120 కి.మీ రేంజ్.. 250 కిలోల కెపాసిటీ.. మీరు ఊహించనంత తక్కువ ధరలో..
Zypp Cargo EV Scooty: అనువైన బడ్జెట్ లో కార్గో వేరియంట్లో ఇప్పటి వరకూ సరైన ద్విచక్ర వాహనం లేదనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి అవసరాలను తీర్చేందుకు, కేవలం డెలివరీ బాయ్స్ కోసం కొత్త స్కూటీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. జిప్( Zypp) స్టార్టప్ దీనిని ఆవిష్కరించింది.

ఇటీవల కాలంలో ఈ కామర్స్ సైట్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఫుడ్ దగ్గర నుంచి గృహోపకరణాలు వరకూ అన్నీ ఆన్ లైన్ బుకింగ్స్ ఏ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెలివరీ బాయ్స్ కి డిమాండ్ కి పెరుగుతోంది. అయితే ఆర్డర్లను డెలివరీ చేయడానికి అనువైన వాహనం మాత్రం వారికి దొరకడం లేదు. విపరీతంగా పెరిగిన పెట్రోల్ ధరలు డెలివరీ చేసే వారి కష్టాలను మరింత పెంచాయి. ఈక్రమంలో వారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే వారికి అనువైన బడ్జెట్ లో కార్గో వేరియంట్లో ఇప్పటి వరకూ సరైన ద్విచక్ర వాహనం లేదనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి అవసరాలను తీర్చేందుకు, కేవలం డెలివరీ బాయ్స్ కోసం రూపొందించిన కొత్త స్కూటీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. జిప్( Zypp) స్టార్టప్ దీనిని ఆవిష్కరించింది. అతి తక్కువ ధరలో, మంచి రేంజ్ ఇచ్చే విధంగా దీనిని రూపొందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
జిప్ కార్గో ఈవీ స్కూటీ..
జిప్ స్టార్టప్ కంపెనీ కార్గో ఈవీ స్కూటీని లాంచ్ చేసింది. ఇది 250 కేజీలకు పైగా బరువును కూడా సునాయాసంగా మోయగలుగుతుంది. ఇందుకోసం వాహనం ముందు, వెనుక, పక్కన కూడా వస్తువులను పెట్టుకునేందుకు ప్రత్యేకమైన స్థలాలు కేటాయించారు. డోర్-టు-డోర్ డెలివరీల కోసం తరచుగా ఉపయోగించే సాధారణ మినీ-ట్రక్కుల కంటే ఇది మరింత పర్యావరణ అనుకూలమైన ఎంపికగా పేర్కొనవచ్చు.
ప్రయోజానాల ఇలా..
జిప్ కార్గోను అనేక రకాల పనులకు వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది ఇ-కామర్స్ బల్క్ షిప్‌మెంట్‌లు, ఫుడ్ డెలివరీ, కిరాణా డెలివరీ కోసం ఉపయోగించవచ్చు. గ్యాస్ సిలిండర్లు, పెట్ సీసాలు, డబ్బాలు వంటి వాటిని కూడా తీసుకెళ్లవచ్చు.
బ్యాటరీ, మైలేజీ ఇలా..
ఢిల్లీలో మొదటిసారి దీనిని లాంచ్ చేశారు. అక్కడ వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా మిగిలిన ప్రాంతాల్లో దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిల 40 ఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. దీనిలో డ్యూయల్ బ్యాటరీ సెటప్ కూడా ఉంది. ఇది డెలివరీల టైం ఇబ్బంది లేకుండా బ్యాటరీ స్వాప్ చేసుకొనే వీలుని కల్పిస్తుంది.
ధర ఇలా..
కార్గో స్కూటీ సింగిల్ బ్యాటరీ ధర రూ. 59,000గా ఉంది. అదే డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ వెర్షన్ అయితే రూ.74,000 అవుతుంది. జిప్ కంపెనీ దీనిపై ఈఎంఐ ఆప్షన్ ని కూడా అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..