Important Deadlines: వినియోగదారులకు అలర్ట్.. మార్చి నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేసుకోండి.. లేకుంటే ఇబ్బందే..!
ఈనెలతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అయితే ఈనెలాఖరులోగా కొన్ని పనులను చేసుకునేందుకు చివరి గడువు ఉంది. ముందస్తుగా అప్రమత్తమై పెండింగ్‌లో ఉన్న పనులను చేసుకోవడం..
ఈనెలతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అయితే ఈనెలాఖరులోగా కొన్ని పనులను చేసుకునేందుకు చివరి గడువు ఉంది. ముందస్తుగా అప్రమత్తమై పెండింగ్‌లో ఉన్న పనులను చేసుకోవడం ఎంతో ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే సమయం వృధా కావడమే కాకుండా జేబుకు చిల్లులు పడే అవకాశం ఉంటుంది. అందుకే అలసత్వం పనికి రాకుండా ముందస్తుగా పనులు చేసుకోవడం చాలా ముఖ్యం. మరికొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అందుకే నెలాఖరులోగా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
- పాన్-ఆధార్‌కు ఇదే చివరి అవకాశం: పాన్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే చాలా సార్లు సూచించింది. చాలా సార్లు గడువు కూడా విధిస్తూ వస్తోంది. ఇక మార్చి 31తో చివరి గడువు ముగియబోతోంది. ఈ లోగా పాన్ – ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్‌కార్డు పని చేయదని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. వాస్తవానికి దీని గడువు ఎప్పుడో ముగిసింది. కానీ కానీ పెనాల్టీ ఛార్జీలను చెల్లించి అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. పెనాల్టీ రుసుముతో 2023 మార్చి 31లోగా పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకునే అవకాశం ఉచ్చింది. ఈ అనుసంధానం పూర్తి చేయాలంటే రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు దాటితే మీ పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని గుర్తించుకోవాలి.
- పెన్షన్ స్కీమ్: ఇక వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర సర్కార్ ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించింది. 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి అండగా ఉండేందుకు కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎల్‌ఐసీ ద్వారా ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఈ పథకంలో చేరాలంటే 2023 మార్చి 31 తుది గడువు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు చెల్లించి పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంది. తర్వాత నెల నుంచే పెన్షన్ ప్రారంభం అవుతుంది. నెలల, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి పెన్షన్ పొందే సదుపాయం ఉంది. ప్రస్తుతం ఈ పథకానికి 7.4 శాతం చొప్పున వడ్డీ అందిస్తోంది. 10 సంవత్సరాల పాటు ఇదే వడ్డీ అందుబాటులో ఉంటుంది.
- ఆదాయపు పన్ను విధానం: 2022-23 ఆర్థిక సంవత్సరానికి పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే వారు మార్చి 31లోగా పన్ను ఆదాయ పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఒక వేళ మీరు ఇప్పటి వరకు ఎలాంటి పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోయి ఉంటే జీవిత బీమా పాలసీఉల, పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, ఎన్‌పీఎస్ వంటి స్కీమ్‌లను పరిశీలించవచ్చు. అయితే కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి ఎలాంటి మినహాయింపులూ వర్తించవు.
- అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేవారికి.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేవారికి నాలుగో ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపులకు గడువు సమీపించబోతోంది. మార్చి 15 లోగా ఆ పని పూర్తి చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి