Fake Credit Cards: సెలబ్రిటీల పేరుతో నకిలీ క్రెడిట్ కార్డుల ఘరానా మోసం!

క్రెడిట్‌ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్‌ కార్డుల విషయంలో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది స్కామర్లు పూణేకు చెందిన ఫిన్‌టెక్ నుంచి సెలబ్రిటీల పేరుతో..

Fake Credit Cards: సెలబ్రిటీల పేరుతో నకిలీ క్రెడిట్ కార్డుల ఘరానా మోసం!
Fake Credit Cards
Follow us
Subhash Goud

|

Updated on: Mar 04, 2023 | 7:06 PM

క్రెడిట్‌ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్‌ కార్డుల విషయంలో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది స్కామర్లు పూణేకు చెందిన ఫిన్‌టెక్ నుంచి సెలబ్రిటీల పేరుతో క్రెడిట్ కార్డులు రెడీ చేశారు. వివిధ ప్రముఖుల పాన్, ఆధార్ వివరాలను ఉపయోగించి ఘరానా మోసానికి తెర తీశారు. ఆ క్రెడిట్ కార్డులను ఉపయోగించి బ్యాంకులకు 50 లక్షల రూపాయలను మోసం చేశారు. MS ధోని, సచిన్ టెండూల్కర్, హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖుల పేరు మీద క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసేలా స్కామర్లు ఫిన్‌టెక్‌ని ఒప్పించగలిగారు. ఈ సెలబ్రిటీల తాజా పాన్ కార్డును జారీ చేయమని ప్రభుత్వ అధికారులను కూడా వారు దారిమళ్లించారు. వారు ‘వన్ కార్డ్’ అయిన పూణే ఆధారిత ఫిన్‌టెక్‌తో క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి నకిలీ పాన్ కార్డ్‌ను ఉపయోగించారు. వారు క్రెడిట్ కార్డులను ఉపయోగించి మొత్తం 50 లక్షల రూపాయలను బ్యాంకులకు మోసం చేశారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ భద్రత లోపాలను వెలుగులోకి వీసుకువచ్చింది.

అయితే ఈ మోసగాళ్లు మోసాలకు పాల్పడేముందు సెలబ్రిటీల జీఎస్టీ వివరాలను గూగుల్‌లో సంపాదించారు. సాధారణంగా జీఎస్టీఐఎన్‌లో ఉండే మొదటి రెండు అంకెలు స్టేట్‌ కోడ్‌ను సూచిస్తాయి. మిగిలిన 10 అంకెల్లో పాన్‌ నంబర్‌ను సూచిస్తాయి. సెల్రబిటీలకు సంబంధించి పుట్టిన తేదీ వివరాలన్నీ గూగుల్‌లో లభించడంతో వీరి పని సులభతరం అయ్యింది. పుట్టిన తేదీ, పాన్‌ వివరాలు లభించడంతో వీరు కొత్త పాన్‌ కార్డుకు వారి వ్యక్తిగత ఫోటోలతో దరఖాస్తు చేశారు. వీడియో వెరిఫికేషన్‌ సమయంలో పాన్‌/ ఆధార్‌ వివరాలు వీరి ఫోటోలు సరిపోలే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మోసగాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వీడియో వెరిఫికేషన్‌ సమయంలో ఏమాత్రం పొరపాటు లేకుండా ఈ మోసగాళ్లు జాగ్రత్త పడ్డారు. అప్పటికే సెలబ్రిటీల తాలుకా ఆర్థిక కార్యకలాపాల వివరాలు వారు సంపాదించుకుని రెడీగా పెట్టుకున్నారు. అసలు క్రెడిట్‌ కార్డుల జారీ, ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌లో ఉన్న లోపాల గురించి కొన్ని నెలల పాటు పరిశోధించారు. వీడియో వెరిఫికేషన్‌ కంటే ముందు క్రెడిట్‌ కార్డు కోసం యాప్‌లో పాన్‌, ఆధార్‌ వివరాలను తమ యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసినట్లు సదరు సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. అసలు పాన్‌ కార్డు, ఆధార్‌ వివరాల స్థానే నకిలీ పాన్‌, ఆధార్‌ వివరాలు ఇచ్చారని ఆ కంపెనీ పేర్కొంది. ఫేక్‌ వివరాలతో అప్లై చేసినప్పటికీ.. బ్యూరో వద్ద ఉన్న పాన్‌, క్రెడిట్‌ లిమిట్‌ వివరాల ఆధారంగా ఒక్కో క్రెడిట్‌ కార్డుకు రూ.10 లక్షల లిమిట్‌ చొప్పున జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!