Annual Maintenance Contract: ఎలక్ట్రానిక్ పరికరాలకు ఏఎంసీ చేయించడం చాలా అవసరం.. AMC అంటే ఏమిటి..?
ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా గృహోపకరణాలు మన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాయి. వినోదం నుంచి బట్టలు ఉతకడం వరకు అన్నింటికీ వాటి పైనే ఆధారపడతాం..
ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా గృహోపకరణాలు మన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాయి. వినోదం నుంచి బట్టలు ఉతకడం వరకు అన్నింటికీ వాటి పైనే ఆధారపడతాం. అవి లేకుండా మన జీవితం గురించి ఆలోచించలేము. అందుకే అవి పాడైతే, అది మన జీవితంలో బ్రేక్ అయినట్లే. మనకు ఈ పరికరాలు చాలా అలవాటైపోయాయి. అవి లేని రోజును మనం ఊహించలేము. అందువల్ల వాటిని చక్కగా పనిచేసేలా ఉంచడానికి ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించడం చాలా ముఖ్యం.
దీని కోసం మీకు సహాయపడే వ్యవస్థ ఉంది. దీన్నే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అంటారు. మీ పరికరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయబడేలా ఏఎంసీ నిర్ధారిస్తుంది. దీని ద్వారా సమయానికి సర్వీస్ చేయించే అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ అవుతుంది. ఏఎంసీ అనేది వస్తువును కొనేవారు, అమ్మేవారికి మధ్య ఒక సర్వీస్ ఎగ్రిమెంట్. ఇది ఒప్పందం ప్రకారం సంబంధిత ప్రోడక్ట్ నిర్వహణ. మరమ్మత్తు సేవలను నిర్ధారిస్తుంది. దీని ప్రకారం, కాంట్రాక్ట్ వ్యవధిలో, ప్రోడక్ట్ లో ఏదైనా సమస్య ఉంటే, విక్రేత ఏజెన్సీ దానిని రిపేర్ చేస్తుంది.
మీరు ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఆర్‌ఓ మొదలైన ప్రొడక్ట్స్ కోసం ఏఎంసీని పొందవచ్చు. ఏఎంసీ సేవ ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ ప్రొవైడర్) లేదా దాని సేవా ఏజెన్సీ ద్వారా అందించబడుతుంది. మీరు ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడు, కంపెనీ మీకు ఏఎంసీని అందిస్తుంది. దానికి మీరు అదనపు ఛార్జీ చెల్లించాలి. మీ ఉచిత వారంటీ వ్యవధి ముగిసిన తర్వాత ఏఎంసీ పొందండి.
ఏఎంసీకి సంబంధించిన కొన్ని ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ఎటువంటి చింత లేకుండా ప్రోడక్ట్ ని ఉపయోగించవచ్చు. పరికరాలు పాడైపోతే, కంపెనీ దానిని మరమ్మత్తు చేస్తుంది. మీరు దాని కోసం ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. మరొక ప్రయోజనం ఏమిటంటే, ఓఈఎం లేదా దాని అధీకృత సర్వీస్ ప్రొవైడర్ సేవను నిర్ధారిస్తుంది. అందుకే భద్రతకు సంబంధించిన సమస్య లేదు. మీరు భర్తీ చేయబడే భాగాల నాణ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సేవలో నాణ్యత మరొక ప్రయోజనం. ఏఎంసీ ద్వారా మీరు నాణ్యమైన సేవను నామమాత్రపు ధరకు పొందవచ్చు, అది నేరుగా OEM లేదా దాని అధీకృత సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కావచ్చు.
ఇది కాకుండా, ధృవీకరించిన నిపుణులు మీకు ఎప్పటికప్పుడు సేవలను అందిస్తారు. ఇది మీ పరికరాల జీవితాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో మరమ్మత్తు ఖర్చులు కూడా ఆదా అవుతాయి. తక్కువ ఖర్చు అంటే మీకు ఎక్కువ పొదుపు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి