Watch Video: సన్‌రూఫ్‌ వాటర్‌ లీక్‌ వ్యవహారంపై స్పందించిన మహీంద్ర.. వీడియోతోనే ధీటైన సమాధానం.

తమ కంపెనీ కారుపై గతకొన్ని రోజులుగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియోపై మహీంద్ర కంపెనీ తాజాగా అధికారికంగా స్పందించింది. మహీంద్రా స్కార్పియో-ఎన్‌ కారుకి సంబంధించి వైరల్‌ అవుతోన్న ఓ వీడియోపై ఎట్టకేలకు సంస్థ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే..

Watch Video: సన్‌రూఫ్‌ వాటర్‌ లీక్‌ వ్యవహారంపై స్పందించిన మహీంద్ర.. వీడియోతోనే ధీటైన సమాధానం.
Scorpio N
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 05, 2023 | 3:31 PM

తమ కంపెనీ కారుపై గతకొన్ని రోజులుగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియోపై మహీంద్ర కంపెనీ తాజాగా అధికారికంగా స్పందించింది. మహీంద్రా స్కార్పియో-ఎన్‌ కారుకి సంబంధించి వైరల్‌ అవుతోన్న ఓ వీడియోపై ఎట్టకేలకు సంస్థ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో-ఎన్‌ కారును జలపాతం కిందకు తీసుకెళ్లిన సమయంలో సన్‌రూఫ్‌ నుంచి వాటర్‌ లీకయినట్లు ఓ యూట్యూబర్‌ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. కారు సన్‌రూఫ్‌ ఇలా ఉంటే ఎలా అంటూ కొందరు నెటిజన్లు స్పందిస్తే.. కావాలనే ఇలా చేశారంటూ మరికొందరు స్పందించారు.

అయితే దీనిపై ఎట్టకేలకు మహీంద్ర స్పందించింది. తన కంపెనీ కార్లపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఓ వీడియోను రూపొందించింది. ఇందులో భాగంగానే అదే జలపాతం కిందికి మరో స్కార్పియో-ఎన్ తీసుకెళ్లి టెస్ట్ చేసింది. అయితే జలపాతం నీరు ఏమాత్రం లోపలికి రాలేదు. ఈ వీడియోను మొదటి వీడియోకి రీప్లేగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో జలపాతం నీరు ఏ మాత్రం లోపలికి రాకుండా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

దీంతో తమ కార్లపై జరిగిన దుష్ప్రచారాన్ని మహీంద్ర ఇలా తెలివిగా తిప్పకొట్టిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మహీంద్ర పోస్ట్‌ వీడియో చివరనా ఒక సూచనను సైతం చేసింది. ఈ వీడియోను అనుభవజ్ఞుల పర్యవేక్షణలో రూపొందించామని, ఎవరూ అనుకరించవద్దని పేర్కొంది. దీనికి కారణంగా జలపాతాలు లాంటి కొండ ప్రదేశాల్లో కారు డ్రైవ్‌ చేయడం కొంత ప్రమాదంతో కూడుకున్న అంశం కాబట్టే.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!