Post Office Schemes: మీ పెట్టుబడికి పూర్తి భరోసా.. కచ్చితమైన రాబడి.. పైగా పన్ను మినహాయింపులు.. అస్సలు మిస్ అవ్వద్దు..

పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడిని పొందవచ్చు. ఈ కథనంలో హామీతో కూడిన రాబడిని అందించే 3 పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.

Post Office Schemes: మీ పెట్టుబడికి పూర్తి భరోసా.. కచ్చితమైన రాబడి.. పైగా పన్ను మినహాయింపులు.. అస్సలు మిస్ అవ్వద్దు..
Post Office Schemes
Follow us
Madhu

|

Updated on: Mar 05, 2023 | 3:30 PM

స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు సహజం. అందులో పెట్టే పెట్టుబడికి రిస్క్ ఉంటుంది. పైగా ఇటీవల స్టాక్ మార్కెట్ చాలా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఇటువంటి పరిస్థితిలో రిస్క్ తో కూడిన ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. కాస్త సురక్షితమైన, కచ్చితమైన పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. అటువంటి సురక్షిత పథకాలు మనకు పోస్ట్ ఆఫీసు అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడిని పొందవచ్చు. ఈ కథనంలో హామీతో కూడిన రాబడిని అందించే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా (పీఓటీడీ), పోస్ట్ ఆఫీస్ – నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ).. ఈ మూడు పథకాలు ఐదేళ్ల లాక్-ఇన్‌ పీరియడ్ తో వస్తాయి. ఈ పోస్టాఫీసు పొదుపు పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ఖాతా (ఆర్డీ).. మీరు 5 సంవత్సరాల పాటు గ్యారెంటీ రిటర్న్‌లతో సురక్షితమైన రికరింగ్ డిపాజిట్ కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా బెస్ట్ ఆప్షన్. ఈ పథకంపై 5.8% వడ్డీ రేటు వస్తుంది. మీరు నెలకు కనిష్టంగా రూ. 100తో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా (పీఓటీడీ).. ఈ పథకంలో మీరు ఒకటి, రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాల కాల పరిమితితో డిపాజిట్లు చేయవచ్చు. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకూ 5.5% వడ్డీ వస్తుంది. 5 సంవత్సరాల వరకూ ఉంటే అత్యధికంగా 6.7% వరకు వడ్డీ అందిస్తుంది. అంతేకాక దీనిలోని పెట్టుబడికి అలాగే వడ్డీకి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. కనీసం రూ. 1000 తో ఖాతా ఓపెన్ చేయవచ్చ. దీనిలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు.

ఇవి కూడా చదవండి

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్.. ఈ పథకం 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో వస్తుంది. ఇది 5 సంవత్సరాల కాలవ్యవధిపై 6.8% వరకు వడ్డీ రేటును అందిస్తుంది. రూ. 1000 తో మీరు ఖాతా ప్రారంభించవచ్చు. లాక్-ఇన్ వ్యవధి పూర్తయిన తర్వాత మాత్రమే మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే, కొన్ని షరతులలో, మీరు ముందుగానే పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు. దీనిలోని డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపును అందిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట