AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OpenAI: అందుబాటులోకి Chat GPT-5 మోడల్‌.. ఫీచర్స్‌ చూస్తే మతిపోవాల్సిందే!

ఏఐ చాట్‌బోట్‌తో ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తున్న Open AI సంస్థ తన సరికొత్త AI మోడల్ GPT-5 ను లాంచ్‌ చేసింది. ఇది గత మోడల్స్ కంటే అద్భుతమైన ఫీచర్స్‌ను కగిలి ఉంటుందని OpenAI CEO సామ్ అల్ట్ మన్ ప్రకటించారు. తాను స్వయంగా వాడిన తర్వాతే ఈ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపాడు. అయితే ఈ కొత్త మోడల్‌ ఫీచర్స్‌ ఏంటో తెలుసుకుందాం పదండి.

OpenAI: అందుబాటులోకి Chat GPT-5 మోడల్‌.. ఫీచర్స్‌ చూస్తే మతిపోవాల్సిందే!
Chatgpt 5
Anand T
|

Updated on: Aug 08, 2025 | 4:04 PM

Share

ఏఐ చాట్‌బోట్‌తో ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తున్న Open AI సంస్థ తన సరికొత్త AI మోడల్ GPT-5 ను లాంచ్‌ చేసింది.ఈ మోడల్‌ అప్‌డేట్‌ ప్రత్యేక ఏమిటంటే ఇది మునుపటి వెర్షన్ల కంటే ఇది మన సాధారణ భాషాను చాలా బాగా అర్థం చేసుకోగలదట.. అందుకు అనుగుణంగానే సమాధానాలు కూడా ఇస్తుందట.. దానితో పాటు కేవలం టెక్స్ట్‌ను మాత్రమే కాకుండా, ఫొటోలు, వీడియోలు, ఆడియోను కూడా అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సమాధానం ఇస్తుందిట. ఈ కొత్త వెర్షన్‌లో పాత దాని కంటే ఎక్కువ కన్వర్జేషన్లను గుర్తుంచుకోగలదట. ఇది కేవలం మనకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా క్లిష్టమైన సమస్యలను విశ్లేషించి, వాటికి పరిష్కారాలను కూడా చూపుతుందట.

అంతే కాకుండా ఇప్పుడు ప్రొఫెషనల్ యూజర్లు మాత్రమే కాకుండా ఉచిత యూజర్లు కూడా ఈ అధునాతన AI మోడల్ GPT-5 ను ఉపయోగించవచ్చు. అయితే, కొంతమందికి ఇప్పటికీ ఏ యూజర్లు ఎంత యాక్సెస్ పొందుతారు, ఎంతకాలం పొందుతారు అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు, ప్రో, టీమ్ వినియోగదారులకు మాత్రమే GPT-5పై ఉచిత యాక్సెస్ ఉండేది. కానీ కొత్త వెర్షన్‌లో, ప్రతి ఒక్కరూ రోజుకు పరిమిత సంఖ్యలో దీన్ని వినిగియోగించుకోవచ్చు. ఈ కొత్త మోడల్  GPT-5 మూడు పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది, GPT-5, GPT-5-మినీ, GPT-5-నానో. అయితే మీరు  GPT-5 పరిమితిని చేరుకున్న వెంటనే, సిస్టమ్ మిమ్మల్ని GPT-5 మినీకి మారుస్తుంది.

ఫ్రీగా GPT-5 మోడల్‌ను ఎంత వరకు ఉపయోగించొచ్చు!

ఉచిత వినియోగదారులకు OpenAI ఇంకా ఖచ్చితమైన పరిమితిని నిర్ణయించలేదు. కానీ మీరు రోజువారీ పరిమితిని దాటి వినియోగిస్తే.. అది మిమ్మల్ని GPT-5 మినీకి తీసుకెళ్తుంది. ఈ వెర్షన్ GPT-4 కంటే చాలా మెరుగ్గా ఉంది, కానీ GPT-5 వలె శక్తివంతమైనది కాదు. పరిమితి ముగిసిన తర్వాత కూడా, మీరు GPT-5 మినీ ద్వారా చాట్ చేయవచ్చు. ఈ వెర్షన్ ప్రత్యేకంగా ఉచిత వినియోగదారులు మంచి అనుభవాన్ని కొనసాగించడానికి రూపొందించబడింది. కానీ మీరు పరిమితులు లేకుండా పూర్తి GPT-5ని ఉపయోగించాలనుకుంటే, మీరు ప్రో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.