AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT companies: ఇండియాలో టాప్ 10 ఐటీ కంపెనీలు ఇవే.. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ఏ స్థానంలో ఉందంటే..? ఫోర్బ్స్ కీలక రిపోర్ట్

ఇండియాలో ఐటీ రంగం ఎంతగా విస్తరించిందో మనందరికీ తెలిసిందే. వందల కొద్ది కంపెనీలు ఇప్పటికే తమ సర్వీసెస్ అందిస్తుండగా.. స్టార్టప్ కంపెనీలు కూడా ఎన్నో పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఫోర్బ్స్ టాప్ 10 ఐటీ కంపెనీలను నమోదు చేసింది. టీసీఎస్ టాప్ స్థానంలో ఉంది.

IT companies: ఇండియాలో టాప్ 10 ఐటీ కంపెనీలు ఇవే.. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ఏ స్థానంలో ఉందంటే..? ఫోర్బ్స్ కీలక రిపోర్ట్
Infosys
Venkatrao Lella
|

Updated on: Nov 27, 2025 | 4:07 PM

Share

ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రంగాల్లో ఐటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, డిజిటల్ ఇన్నేవేషన్‌లో ఇండియా పేరు కొన్ని సంవత్సరాలుగా మారుమ్రోగిపోతుంది. ఎన్నో దశాబ్దాల క్రితం స్టార్ట్ అయిన ఐటీ రంగానికి ఇప్పుడు ఇండియా ఒక గ్లోబల్ సెంటర్‌గా మారింది. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తూ వరల్డ్‌లో ఐటీకి భారత్ అడ్డాగా మారింది. దీని వల్ల టెక్నాలజీని భారత్ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటుండగా.. విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఇండియాలో అందరికంటే ముందు పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నాయి. అంతలా భారత్ టెక్నాలజీ హబ్‌గా మారిపోయింది.

అగ్రస్థానంలో టీసీఎస్

ఈ క్రమంలో తాజాగా ఫోర్బ్స్ ఇండియాలో టాప్ 10 ఐటీ కంపెనీల లిస్ట్‌ను విడుదల చేసింది. మార్కెట్ వాల్యూ, రెవెన్యూ ,గ్లోబల్ రీచ్, ఆదాయ ఉత్పత్తి, ఆర్ధిక పనితీరు, ఆవిష్కరణలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని టాప్ కంపెనీలను గుర్తించింది. ఈ నివేదిక ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారత్‌లో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉంది. మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ 30 బిలియన్లకు పైగా ఆదాయాన్ని నమోదు చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో టీసీఎస్ దూకుడుగా ఉంది.

ఇన్పోసిస్ క్రేజ్

ఇక నారాయాణమూర్తి ఆధ్వర్యంలోని ఇన్పోసిస్ రెండో స్థానంలో నిలిచింది. . ఇన్ఫోసిస్ ఏటా దాదాపు 18 బిలియన్ల ఆదాయాన్ని పొందుతుంది. 59 దేశాలలో క్లయింట్లతో ఇన్ఫోసిస్ తన ఆధిపత్యాన్ని కనబరుస్తుంది. ఇక మూడో స్థానంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉంది. ఇది 2025లో 13 బిలియన్ల ఆదాయాన్ని రాబట్టుకుంది. ఇక నాలుగో స్థానంలో విప్రో, ఐదో స్థానంలో ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ఆరో స్థానంలో టెక్ మహీంద్రా ఉన్నాయి. 7వ స్థానంలో Persistent, 8వ స్థానంలో ఒరాకిల్ ఫిన్ సర్వీసెస్, 9వ స్థానంలో Coforge, పదో స్థానంలో Mphasis సంస్ధలు ఉన్నాయి.