Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత బ్లడ్‌ గ్రూప్‌! భారత సంతతి వ్యక్తి శరీరంలో కొత్త రకం బ్లడ్‌.. వైద్య చరిత్రలో తొలిసారిగా..

సాధారణంగా మనుషులందరికీ A, B, O, AB బ్లడ్‌ గ్రూపుల్లో ఏదో ఒకటి ఉంటుంది. ఐతే ఓ వ్యక్తి హర్డు ప్రాబ్లెంతో హాస్పిటల్‌కు వెళ్లగా అతని రక్తాన్ని పరీక్షించిన డాక్టర్లు ఒక్క సారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే..

వింత బ్లడ్‌ గ్రూప్‌! భారత సంతతి వ్యక్తి శరీరంలో కొత్త రకం బ్లడ్‌.. వైద్య చరిత్రలో తొలిసారిగా..
New Blood Group
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 14, 2022 | 9:24 PM

Unique blood group found in Gujarat man: సాధారణంగా మనుషులందరికీ A, B, O, AB బ్లడ్‌ గ్రూపుల్లో ఏదో ఒకటి ఉంటుంది. ఐతే ఓ వ్యక్తి హర్డు ప్రాబ్లెంతో హాస్పిటల్‌కు వెళ్లగా అతని రక్తాన్ని పరీక్షించిన డాక్టర్లు ఒక్క సారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే పై నాలుగు బ్లడ్‌ గ్రూపుల్లో అతని రక్తం ఏ గ్రూప్‌తోనూ మ్యాచ్ అవ్వలేదు. వివరాల్లోకెళ్తే..

గుజరాత్‌కు చెందిన అహ్మదాబాద్‌లో65 ఏళ్ల వృద్ధుడు హార్ట్‌ అటాక్‌తో ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు అతనికి ఆపరేషన్‌ చేయాలి, అందుకు బ్లడ్‌ అవసరం అవుతుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఐతే పేషెంట్‌ రక్తం ఏ బ్లడ్‌ గ్రూప్‌కు చెందిందో తెలుసుకునే ప్రయత్నంలో అతని బ్లడ్‌ శాంపిళ్లను సూరత్‌లోని బ్లడ్ డొనేషన్‌ సెంటర్‌కు వైద్యుడు పంపించారు. ఐతే సదరు బ్లడ్‌ శాంపిల్‌ను పరీక్షించిన నిపుణులు A, B, O, AB గ్రూపులలో ఏ ఒక్కదానితో కూడా మ్యాచ్‌ అవ్వకపోవడంతో, ఆ శాంపిల్‌ను అమెరికాకు పంపారు. అక్కడి పరిశోధకులు పరీక్షించిన తర్వాత సదరు వృద్ధుని రక్త వర్గం భారతదేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలో పదవ అరుదైన రక్తంగా కనుగొన్నారు. ఇతని రక్తంలో EMM లేకపోవడంతో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (ISBT).. ఈ బ్లడ్‌కు EMM నెగెటివ్‌గా నామకరణం చేశారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా, మానవ శరీరంలో నాలుగు రకాల బ్లడ్‌ గ్రూపులుంటాయి. A, B, O, Rh, Duffy వంటి 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. అలాగే EMM అధికంగా ఉండే 375 రకాల యాంటిజెన్‌లు కూడా ఉంటాయి. వీటిల్లో కూడా దేనితో మ్యాచవ్వలేదు. భారతదేశం మొత్తంలో మొట్టమొదటి సారిగా కొత్తరకం బ్లడ్‌ గ్రూపును వ్యక్తి ఇతనేనని, ప్రపంచంలో ఈ విధమైన వింత బ్లడ్‌ గ్రూపులున్న వ్యక్తులు 10 మంది ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. EMM నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు తమ రక్తాన్ని ఎవరికీ దానం చేయలేరు. అలాగే ఎవరి రక్తాన్ని పొందలేరు. ఇటువంటి అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా గుజరాత్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తితో కలిపి 10 మంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.