Health Tips: జుట్టురాలిపోతోందా? కళ్లు మసకబారుతున్నాయా? ఐతే ఈ సమస్య ఉన్నట్లే..
ప్రాణప్రధంగా చూసుకునే జుట్టు కళ్లముండే రాలిపోతుంటే.. ఆ బాధ వర్ణణాతీతం. కురులు నేల రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో పోషకాహార లోపం కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా..
Benefits of zinc for hair: ప్రాణప్రధంగా చూసుకునే జుట్టు కళ్లముండే రాలిపోతుంటే.. ఆ బాధ వర్ణణాతీతం. కురులు నేల రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో పోషకాహార లోపం కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఆహారం ద్వారా మాత్రమే అందుతాయి. వీటిల్లో ముఖ్యంగా జింక్ లోపిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. నిజానికి మన శరీరానికి రోజువారి కొంత మత్తంలో జింక్ అవసరం ఉంటుంది. రోగనిరోధక శక్తి, కణ విభజన, కణాల ఎదుగుదల, ప్రొటీన్లు, డీఎన్‌ఏ నిర్మాణం వంటి వాటికి దాదాపు 300 ఎంజైమ్‌లు అవసరం. ఆ ఎంజైమ్‌లను పనిచేసేలా చేయడం కోసం జింక్ ఉపయోగపడుతుంది. జింక్‌ను శరీరం నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. మగవారికి రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం. మహిళలకు మాత్రం 8 మిల్లీ గ్రాముల జింక్ సరిపోతుంది. గర్భిణిలు, పాలిచ్చే తల్లులకు మాత్రం12 మిల్లీ గ్రాములు అవసరం.
జింక్ లోపిస్తే మొదటిగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా జింక్ చేస్తుంది. జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో కూబి మార్పులు చోటుచేసుకుంటాయి. ఆకలి మందగించి, ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. జింక్ లోపం వల్ల జుట్టు అధికంగా రాలిపోయి, జుట్టు పలుచబడుతుంది. కంటి చూపుకు చూడా జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగించి, చూపు మసక బారుతుంది.
జింక్ వీటిల్లో సమృద్ధిగా ఉంటుంది.. పచ్చి శనగలు, పప్పు ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాక్‌లెట్లు, పాలకూర, పుట్టగొడుగులు, గుడ్డు, అరటి పండు, గుమ్మడి విత్తనాలు, మాంసం, వాల్‌నట్స్, జొన్నలు తదితర ఆహారాల్లో జింక్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.