Health: వంటగదిలో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు
మనం నివసించే ఇంట్లో అత్యంత ముఖ్యమైనది వంటగది (Kitchen) మంచి ఆరోగ్యానికి పునాది పడేది అక్కడే. అందుకే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ చేసే చిన్న పొరపాటు కూడా మనకు తీవ్ర నష్టం కలిగించవచ్చు. మనం తినే ఆహారం ఎంత...
మనం నివసించే ఇంట్లో అత్యంత ముఖ్యమైనది వంటగది (Kitchen) మంచి ఆరోగ్యానికి పునాది పడేది అక్కడే. అందుకే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ చేసే చిన్న పొరపాటు కూడా మనకు తీవ్ర నష్టం కలిగించవచ్చు. మనం తినే ఆహారం ఎంత ముఖ్యమో తయారుచేసే విధానం కూడా అంతే ముఖ్యం. అందుకే వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యకర (Health Tips) జీవనానికి బాటలు అక్కడి నుంచే పడాలి. ఏ వంట చేసుకున్నా అది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్ నుంచి తాజా, పరిశుభ్రమైన కూరగాయలు, మాంసం తీసుకువస్తే సరిపోదు. దానిని వండేటప్పుడు కూడా అంతే శుభ్రతను పాటించాలి. అందుకే కిచెన్ లో కొన్ని పొరపాట్లను అస్సలు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంటగది గట్టును క్లీన్ చేసేందుకు స్పాంజ్ లు వినియోగించడం సాధారణ విషయమే. అయితే ఒకే స్పాంజ్‌తో వంటగదిని శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. మురికి కూరుకుపోయి కీటకాలు వస్తాయి. ఇవి ఆహార పదార్థాలపై చేరి కలుషితం చేస్తాయి. అంతే కాకుండా కూరగాయలు, మాంసాన్ని తీసుకువస్తే ఎన్నో క్యారీ బ్యాగులు పోగవుతూ ఉంటాయి. వాటిని ఉపయోగించడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మార్కెట్ నుంచి తీసుకువచ్చిన కూరగాయలు, మాంసాన్ని కడగడం చాలా ముఖ్యం. శుభ్రమైన నీళ్లతో గానీ, నీళ్లలో ఉప్పు వేసి కడగాలి. సాధారణంగా వంట చేసేటప్పుడు నూనె ఒలికిపోతూ ఉంటుంది. ఆలా జరిగినప్పుడు తర్వాత చేద్దాంలే అనుకోకుండా వెంటనే శుభ్రం చేసుకోవాలి. అది అలాగే ఉంటే వంట గది మొత్తం వ్యాపిస్తుంది. అంతే కాకుండా జారి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంది. వండిన పదార్థాలు పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్ లో పెడితే బ్యాక్టీరియా పెరగదని నిపుణులు చెబుతున్నారు. నోట్.. ఈ విషయాలు పాఠకుల అవగాహన కోసం మాత్రమే.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి