AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్‌.. స్టేటస్‌లో ఇకపై ఫొటోలు, వీడియోలే కాదండోయ్‌..

WhatsApp: మెసేజింగ్ యాప్‌ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది వాట్సాప్‌. అంతలా యూజర్లను అట్రాక్ట్‌ చేసిందీ యాప్‌. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని...

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్‌.. స్టేటస్‌లో ఇకపై ఫొటోలు, వీడియోలే కాదండోయ్‌..
Narender Vaitla
|

Updated on: Jul 15, 2022 | 6:53 AM

Share

WhatsApp: మెసేజింగ్ యాప్‌ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది వాట్సాప్‌. అంతలా యూజర్లను అట్రాక్ట్‌ చేసిందీ యాప్‌. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది కాబట్టే వాట్సాప్‌ ఇంతటి క్రేజ్‌. పెరుగుతోన్న పోటీని తట్టుకునే క్రమంలోనే వాట్సాప్‌ ఇటీవల వరుస పెట్టి కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌ టీమ్‌.

సాధారణంగా స్టేటస్‌లో వీడియోలు, ఫొటోలు, టెక్ట్స్‌లను పోస్ట్‌ చేస్తుండడం మనందరికీ తెలిసిందే. అయితే వాట్సాప్‌ ఇప్పుడు దీనికి కొత్తగా మరో ఆప్షన్‌ను తీసుకొస్తోంది. అదే ఇకపై యూజర్లు తాము స్వయంగా రికార్డ్‌ చేసిన ఆడియోను నేరుగా స్టేటస్‌లో పోస్ట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం పాడ్‌ కాస్ట్‌లకు విపరీతంగా క్రేజ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించడానికి వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడినట్లు తెలుస్తోంది. నచ్చిన ఫొటో లేదా వీడియోను పోస్ట్‌ చేసి దానిపై ఆడియో రూపంలో కామెంట్‌ చేయొచ్చన్నమాట.

ప్రస్తుతం వాట్సాప్‌ స్టేటస్‌ బార్‌ను క్లిక్‌ చేయగానే కెమెరా, టెక్ట్స్‌ ఫీచర్లు కనిపిస్తున్నాయి కదూ.. అయితే ఈ కొత్త అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆడియో స్టేటస్‌ పోస్ట్‌ చేసేందుకు వీలుగా మైక్‌ సింబల్‌ కనిపిస్తుంది. దీంతో నేరుగా వాయిస్‌ రికార్డ్‌ చేసుకొని స్టేటస్‌లో పోస్ట్‌ చేయొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి