AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Face RD: ఆధార్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. యూఐడీఏఐ నుంచి సరికొత్త యాప్‌

Aadhaar Face Authentication: ప్రస్తుతం ముఖ్యమైన పత్రాలలో ఆధార్‌ కార్డు అనే చెప్పాలి. ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో ఇదొకటి. ఇది లేనిది ఏ పనులు జరగవు. ఆధార్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం..

Aadhaar Face RD: ఆధార్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. యూఐడీఏఐ నుంచి సరికొత్త యాప్‌
Aadhaar Face Rd
Subhash Goud
|

Updated on: Jul 14, 2022 | 12:34 PM

Share

Aadhaar Face Authentication: ప్రస్తుతం ముఖ్యమైన పత్రాలలో ఆధార్‌ కార్డు అనే చెప్పాలి. ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో ఇదొకటి. ఇది లేనిది ఏ పనులు జరగవు. ఆధార్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గదర్శకాలను జారీ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా యూఐడీఐ (UIDI) కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధార్‌ ఫేస్‌ అథంటికేషన్‌ ఆర్‌డీ పేరుతో కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. దీని సాయంతో ఆధార్‌ కార్డుదారులు ఎక్కడి నుంచైనా ఫేస్‌ అథంటికేషన్‌ (Aadhaar Face Authentication)ను పూర్తి చేసుకోవచ్చు. అంతే మీ మొబైల్‌లో యాప్‌ ఉంటే చాలు ఫోన్‌ ద్వారా మీ ఫేస్‌ స్కానింగ్‌తో అథంటికేషన్‌ పూర్తి చేసుకునే సదుపాయం. యూఐడీఏఐ తీసుకున్న నిర్ణయంతో చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇందు కోసం యూఐడీఏఐ ఆర్‌డీ (Aadhaar Face Rd) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ ఆధార్‌ యాప్‌ సర్వీస్‌ను జీవన్‌ ప్రమాణ్‌, పీడీఎస్‌, స్కాలర్‌షిప్‌ స్కీమ్‌లు, కోవిడ్‌, ఫార్మర్‌ వెల్ఫేర్‌ పథకాలు వంటి వాటికి ఉపయోగించుకోవచ్చని యూఐఈఏఐ ఓ ట్వీట్‌లో తెలిపింది. ఆధార్‌ ఉన్నవాళ్లు వారి ఆధార్‌ నెంబర్‌లు, ఇతర డెమొగ్రాఫిక్‌, బయోమెట్రిక్‌ డేటాను ఫేస్‌ అథంటికేసన్‌ కోసం సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో పొందుపర్చుకోవచ్చు. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని యుఐడిఎఐ ఇన్‌హౌస్‌లో అభివృద్ధి చేసిందని, Aadhaar FaceRD యాప్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఆధార్ ప్రామాణీకరణ కోసం వ్యక్తి ముఖాన్ని క్యాప్చర్ చేస్తుందlr UIDAI ట్వీట్ ద్వారా తెలిపింది. మీ మొబైల్‌లో Google Play Store యాప్‌ను సందర్శించి Aadhaar FaceRD యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి