Ashada Masam: ఆషాఢ మాసంలో అత్తా కోడలు ఎందుకు దూరంగా ఉండాలి..? అసలు రహస్యం ఇదే..!

Ashada Masam: ఆషాఢమాసం.. ఈ మాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కొత్తగా పెళ్లాయిన భార్య, భర్తలు దూరంగా ఉండాలని. ఈ సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదని శాస్త్రం చెబుతోందని..

Ashada Masam: ఆషాఢ మాసంలో అత్తా కోడలు ఎందుకు దూరంగా ఉండాలి..? అసలు రహస్యం ఇదే..!
Ashada Masam
Follow us
Subhash Goud

|

Updated on: Jul 14, 2022 | 12:13 PM

Ashada Masam: ఆషాఢమాసం.. ఈ మాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కొత్తగా పెళ్లాయిన భార్య, భర్తలు దూరంగా ఉండాలని. ఈ సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదని శాస్త్రం చెబుతోందని వేదపండితులు చెబుతున్నారు. బార్యాభర్తలే కాకుండా ఈ ఆషాఢ మాసంలో అత్తా కోడళ్లు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. అసలు ఈ సాంప్రదాయం కొనసాగడం వెనుక కారణం కూడా ఉంది. చాలావరకు వివాహాలు మాఘ, వైశాఖమాసంలో జరుగుతాయి. వైశాఖమాసం అంటే చెప్పనవసరం లేదు. మండే వేసవికి అనుకూలమైన మాసం. ఈ మండే వేసవికి కొత్తగా వచ్చిన పెళ్లికూతురుకు అసౌకర్యంగా భావన కలగడంతో అత్తా కోడల మధ్య సఖ్యత లేకుండా పోతుందని పండితులు చెబుతున్న మాట. అందువల్లే కొత్తగా పెళ్లాయిన మహిళలను ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపిస్తారని చెబుతుంటారు చెబుతుంటారు. ఇదే ఆషాఢ మాసంలో అత్తా కోడలు ఒకే ఇంట్లో ఉండకపోవడానికి కారణం అని కొంతమంది చెబుతుంటారు.

మరి కొంత మంది మరో విధంగా..

ఈ విషయంలో మరి కొంత మంది మరో విధంగా చెబుతుంటారు. ఆషాఢ మాసం అనేది తొలకరి చినుకులతో పంటలు వేయడానికి అనుకూలంగా ఉండే మాసం. రైతు కష్టపడితే గానీ దేశానికి తిండి దొరకని పరిస్థితి. ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన వరుడు భార్య మీద వ్యామోహంతో వ్యవసాయ పనులను దూరం పెడతారు. అందుకే భార్య ను పుట్టింటికి పంపిస్తారని మరో విధంగా చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండటం వల్ల..

అలాగే ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండటం వల్ల స్త్రీ గర్భం దాలిస్తే 9నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని, అలాటి సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని, దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీతో తల్లీబిడ్డలకు ఈ వాతావరణం మంచిది కాదనే భావన ఉండటంతో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారని చెబుతుంటారు. అలాగే ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభ కార్యాలు చేయకూడదని భావిస్తుంటారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి