Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Cider Vinegar: ప్రతి రోజు ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

Apple Cider Vinegar: వెనిగర్‌ను కొన్ని వంటల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తుంటాము. వెనిగర్‌ లేకపోతే దాని రుచిపోతుంది. అందుకే వెనిగర్‌ను వాడటం తప్పనిసరి..

Apple Cider Vinegar: ప్రతి రోజు ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
Apple Cider Vinegar
Follow us
Subhash Goud

|

Updated on: Jul 11, 2022 | 11:12 AM

Apple Cider Vinegar: వెనిగర్‌ను కొన్ని వంటల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తుంటాము. వెనిగర్‌ లేకపోతే దాని రుచిపోతుంది. అందుకే వెనిగర్‌ను వాడటం తప్పనిసరి ఉంటుంది. సాధారణంగా వంటగదిలో తప్పకుండా ఉంటుంది. అలాగే గ్రీస్‌, కార్పెట్ ను శుభ్రం చేసుకోవడానికి, ఇతర మరకలు పోవడానికి ఉపయోగిస్తుంటాం. అంతేకాకుండా దీని వల్ల మంచి ఫ్లేవర్‌ పొందడానికి కూడా ఉంటుంది.

అలాగే ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌, వైట్‌ వెనిగర్‌ను కూడా ఉపయోగిస్తుంటారు. యాపిల్ సైడర్ వెనిగర్ ACV అని కూడా పిలుస్తారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన మాయా పానీయాలలో ఒకటి. బరువు తగ్గడం నుండి క్యాన్సర్‌తో బాధపడే ప్రమాదాన్ని తగ్గించడం వరకు దీనిని తీసుకోవడం కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి మీకు సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. మీరు ఈ పానీయాన్ని సరైన మార్గంలో తీసుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరు. నిపుణుల సూచనలను పాటించకపోవడం కొన్ని ప్రాణాంతక ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ సైడ్ ఎఫెక్ట్స్:

ఇవి కూడా చదవండి

యాపిల్ సైడర్ వెనిగర్ దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. రోజూ యాపిల్‌ సైడ్‌ వెనిగర్‌ (ACV)ను తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల తలెత్తే అవకాశం ఉంది.

జీర్ణ సమస్యలను ప్రేరేపిస్తుంది: యాపిల్ సైడర్ వెనిగర్ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అందుకే ఆపిల్ సైడర్ వెనిగర్‌ను క్రమం తప్పకుండా తాగే వ్యక్తులు కడుపులో అసౌకర్యం లేదా జీర్ణ సమస్యలను ఎదర్కొవచ్చు. గ్యాస్, ఉబ్బరం మొదలైనవి ఉండవచ్చు. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకున్నట్లయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగులు ACVని తీసుకునే ముందు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను మారుస్తుంది. మోతాదులో తీసుకుంటే చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ప్రతి వెనిగర్‌లో ఆమ్లం ఉంటుంది. ఇది పంటిపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. యాపిల్ సైడర్ వెనిగర్ ను ఎక్కువ తాగడం వల్ల దంతాలు కోతకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్ pH స్థాయిలు దాదాపు 2 లేదా 3 ఉంటాయి. అందుకే ACV పలుచన లేకుండా తీసుకుంటే గొంతు చికాకు కలిగించే అవకాశం ఉంది. ఇది అన్నవాహిక గాయం, నొప్పి, గొంతు అసౌకర్యానికి దారితీస్తుంది.

పొటాషియం స్థాయిలను తగ్గిస్తుంది:

అధిక మొత్తంలో ACV తీసుకోవడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి. ఇది హైపోకలేమియాకు కారణమవుతుంది. హైపోకలేమియా ఎముక ఖనిజ సాంద్రతను తగ్గించడం ద్వారా ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వాటిని విరిగిపోయేలా చేస్తుంది. ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఆరోగ్యానికి మంచిదే అయినా మోతాదులో తీసుకోవాలి. కొంత మంది నీటిలో పలచగా చేసి పానీయంగా తీసుకుంటారు. ఇటువంటి సందర్భాలలో ఒక పెద్ద గ్లాసు నీటిలో కలిపి రోజుకు 510 మి.లీ వరకు తీసుకోవచ్చు.

 ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ప్రయోజనాలు..

☛ బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది

☛ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది

☛ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది

☛ హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేడడంలో ఉపయోగపడుతుంది

☛ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి