- Telugu News Photo Gallery How cancer drug Sabizabulin cuts risk of death in Covid 19 patients know the science behind it
Cancer Drug: క్యాన్సర్ ఔషధం కరోనా నుండి మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. అధ్యయనంలో సంచలన విషయాలు
Cancer Drug: క్యాన్సర్ మందు కరోనా రోగుల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఇటీవల ప్రచురించబడిన కొత్త క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే సబిజాబులిన్..
Updated on: Jul 10, 2022 | 7:22 PM

Cancer Drug: క్యాన్సర్ మందు కరోనా రోగుల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఇటీవల ప్రచురించబడిన కొత్త పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే సబిజాబులిన్ అనే మందుతో తీవ్రమైన కరోనా రోగుల (కోవిడ్ -19 రోగులు) మరణాల సంఖ్య నాలుగింట ఒక వంతు తగ్గుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

సబిజాబులిన్ అనే క్యాన్సర్ ఔషధాన్ని తయారు చేసే సంస్థ వెరూ వివరాల ప్రకారం.. అధ్యయనంలో కోవిడ్ చాలా మంది మరణానికి కారణమైంది. ఆసుపత్రిలో ఐసియు, మెకానికల్ వెంటిలేటర్, సాధారణ చికిత్స తీసుకుంటున్న కోవిడ్ రోగులపై ట్రయల్స్ నిర్వహించారు.

ఔషధం ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. ఈ ఔషధం అణువులు వైరస్ కార్యకలాపాలను నిరోధించడానికి, శరీరంలోని మంటను నియంత్రించడానికి ప్రయత్నిస్తాయని పరిశోధన నివేదిక చెబుతోంది. ప్రస్తుతం ఈ ఔషధాన్ని ప్రోస్టేట్, బ్రెస్ట్, సర్వైకల్, ఊపిరితిత్తులు, మెలనోమా, లుకేమియా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగులపై ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

పరిశోధనలో మొత్తం 204 మంది రోగులను చేర్చారు. అలాంటి వారిలో 134 మందిపై కేన్సర్ మందులు వాడారు. అదే సమయంలో 70 మంది రోగులకు సాధారణ చికిత్స అందించబడింది. క్యాన్సర్ ఔషధం ఇచ్చిన రోగులలో మరణాల సంఖ్య దాదాపు 25 శాతం తగ్గిందని అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఔషధం వైరస్ కార్యకలాపాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా అది పెరగకుండా ఆపవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. పరిశోధన సమయంలో రోగులకు క్యాన్సర్ మందులు ఇవ్వబడ్డాయి. దీని తర్వాత మరణాల సంఖ్య ఏ మేరకు తగ్గుతుందనే విషయంపై పరిశీలించారు. మృతుల సంఖ్య తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ఔషధాన్ని రోగులకు ఇచ్చిన 3 రోజుల తర్వాత కూడా ప్రభావం కనిపించడం ప్రారంభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 15 రోజుల పాటు రోగులకు అందించినట్లు చెప్పారు.





























