- Telugu News Photo Gallery Cricket photos Sunil Gavaskar Birthday special: Team india former captain sunil gavaskar net worth 2022 Income cars collection check here
Sunil Gavaskar Birthday Special: రిటైర్మెంట్ అయినా లిటిల్ మాస్టర్ సంపాదన తగ్గలే.. ఆస్తుల విలువ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
గవాస్కర్ చివరిసారిగా 1987లో భారత్ తరపున మ్యాచ్ ఆడాడు. అతను క్రికెట్ మైదానాన్ని విడిచిపెట్టి 3 దశాబ్దాలకు పైగా గడిచిపోయింది. అయితే దీని తర్వాత కూడా అతని ప్రజాదరణ రోజురోజుకు పెరిగింది.
Updated on: Jul 10, 2022 | 2:52 PM

సునీల్ గవాస్కర్ ఈరోజు తన 73వ పుట్టినరోజు చేసుకుంటున్నాయి. 1949 జులై 10న జన్మించిన గవాస్కర్.. ఆయన కుటుంబం క్రీడా ప్రపంచంతో అనుబంధం కలిగి ఉంది. అతని మామ రిటైర్డ్ క్రికెటర్. క్రికెట్‌ను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భారత మాజీ కెప్టెన్ గవాస్కర్ తనదైన కృషి చేశాడు. అతని స్టైల్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉండేది. అందుకే లిటిల్ మాస్టర్ అని కూడా పిలిచేవారు.

గవాస్కర్ చివరిసారిగా 1987లో భారత్ తరపున మ్యాచ్ ఆడాడు. అతను క్రికెట్ మైదానాన్ని విడిచిపెట్టి 3 దశాబ్దాలకు పైగా గడిచిపోయింది. అయితే దీని తర్వాత కూడా అతని ప్రజాదరణ రోజురోజుకు పెరిగింది. లిటిల్ మాస్టర్ పుట్టినరోజున అతని నికర విలువ, సంపాదన ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వయసులో కూడా గవాస్కర్ ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. సునీల్ గవాస్కర్ నికర విలువ దాదాపు 220 కోట్లు. గవాస్కర్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు. ఇది కాకుండా, ముంబై, గోవాతో సహా అనేక ప్రదేశాలలో అతనికి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి.

గవాస్కర్ ప్రతి నెలా కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. ఆయన వార్షిక ఆదాయం రూ.12 కోట్లకు పైగానే ఉంది.

సునీల్ గవాస్కర్ కలెక్షన్‌లో పెద్దగా కార్లు లేకపోవడం విశేషం. అతను ఎక్కువగా తన BMW సిరీస్‌ను ఉపయోగిస్తుంటాడు.





























