High Cholesterol: తరచుగా కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే, మీ శరీరంలో ఈ సమస్య ఉన్నట్లే..!
High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మంచి సంకేతం కాదు. ఇది శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది.
High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మంచి సంకేతం కాదు. ఇది శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దానికంటే ముఖ్యంగా.. గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే, ఇక్కడ సమస్య ఏంటంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయని త్వరగా అర్థం చేసుకోలేం. కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్. కొలెస్ట్రాల్ అధికంగా పెరగడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయి.
రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు, రక్త ప్రవాహానికి అడ్డంకిగా మారుతుంది. కాళ్లకు ఆక్సిజన్‌ను సరిగ్గా అందదు. ఫలితంగా.. కాలి కండరాలలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌కు సంకేతం. చాలా సందర్భాలలో కొలెస్ట్రాల్ కాళ్ళ స్నాయువులను ప్రభావితం చేస్తుంది. కాళ్లలో అసాధ్యమైన నొప్పి కూడా వస్తుంది. ఈ రకమైన నొప్పి తొడలు లేదా మోకాళ్ల క్రింద, వెనుక భాగంలో ఎక్కువగా ఉంటుంది. నడిచేటప్పుడు నొప్పి మరింత పెరుగుతుంది.
గుండెపై ఒత్తిడి.. కొలెస్ట్రాల్ పెరిగి గుండెపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PDA) వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. అదే జరిగితే.. స్పీడ్‌గా పరుగెత్తడం కాదు కదా.. కనీసం నడవలేని పరిస్థితి ఉంటుంది. శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.
దవడలో తీవ్రమైన నొప్పి.. చాలా సార్లు దవడలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆహారాన్ని నమలడం కూడా కష్టంగా మారుతుంది. గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు, దవడలో సమస్య ఏర్పడుతుంది. దవడ నొప్పి నుండి ఛాతీ నొప్పి కూడా పెరుగుతుంది. వీటితో పాటు ఇంకొన్ని సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.