Obesity Problem: దేశంలో పెరుగుతున్న ఊబకాయం సమస్య.. కారణాలు ఏమిటి..? ఈ చిట్కాలు పాటించండి

Obesity Problem: దేశంలో రకరకాల వ్యాధులతో ఎంతో మంది బాధపడుతున్నారు. దేశంలో1.38 బిలియన్లకుపైగా జనాభా ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారు. 2016 లో 34.3 మిలియన్లు..

Obesity Problem: దేశంలో పెరుగుతున్న ఊబకాయం సమస్య.. కారణాలు ఏమిటి..? ఈ చిట్కాలు పాటించండి
Obesity Problem
Follow us
Subhash Goud

|

Updated on: Jul 10, 2022 | 2:12 PM

Obesity Problem: దేశంలో రకరకాల వ్యాధులతో ఎంతో మంది బాధపడుతున్నారు. దేశంలో1.38 బిలియన్లకుపైగా జనాభా ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారు. 2016 లో 34.3 మిలియన్లు ఉండగా, 2012లో ఈ సంఖ్య 25.2 మిలియన్లు మాత్రమే ఉంది. భారతదేశంలోని వయోజన జనాభాలో ఊబకాయం ప్రాబల్యం 2012లో 3.1 శాతం నుంచి 2016లో 3.9 శాతానికి పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ కూడా 2030 నాటికి భారతదేశంలో 27 మిలియన్లకు పైగా పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారని అంచనా వేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారంతో పనిచేసే సమాఖ్య నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 10 మంది పిల్లలలో ఒకరిని ఉభకాయం ఉంటుందని చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే మొత్తం భారతీయ జనాభా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఇప్పుడు రుజువైంది. అయితే ఊబకాయం అనేది పెద్ద సమస్యగా మారింది. చెడు జీవనశైలి కారణంగా ఈ సమస్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా మారిన జీవనశైలి దీనికి కారణమని బేరియాట్రిక్ సర్జన్ చెప్పారు.

ఫరీదాబాద్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ డైరెక్టర్ జనరల్ సర్జరీ డాక్టర్ బ్రహ్మ్ దత్ పాఠక్ మాట్లాడుతూ.. “నేడు మన జీవనశైలి ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లను మార్చింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మర్చిపోయి ఇష్టానుసారంగా ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం కేసులు పెరుగుతున్నాయన్నారు. బయటి ఫుడ్డు ఆర్డర్‌ చేసుకోవడం, ఫాస్ట్‌ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం కేసులు పెరుగుతున్నాయన్నారు.

ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకునే వ్యక్తులు..

ఇవి కూడా చదవండి

కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలను వినియోగిస్తున్నారు. అసలైన, ఇప్పుడు ఇంట్లో తయారుచేసిన ఆహారంలో కూడా అనవసరమైన నూనెను ఉపయోగిస్తారు. ప్రతి రిమోట్ టెక్నాలజీ దానితో పాటు ఊబకాయం యొక్క 8 శాతం అవకాశాన్ని తెస్తుంది. ఉదాహరణకు.. ఇంట్లో కూర్చుండి వర్క్‌ చేస్తున్న సమయంలో ఎటు కదలకుండా అలాగే కూర్చుండటం వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వల్ల ఊబకాయం పెరిగింది.

ఊబకాయాన్ని పెంచడంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. మనం తినే వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. ఆహారం నాణ్యత, పరిమాణం రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎన్ని కేలరీలు వినియోగిస్తున్నాము .. అదనపు కేలరీలను బర్న్ చేయగలమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి రోజు గంటసేపు వ్యాయామం చేస్తే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చంటున్నారు. మీరు 30 నిమిషాల కంటే ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవలసి వస్తే మధ్యలో లేచి 5 నుండి 10 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందంటున్నారు. ప్రతి రోజు వ్యాయమం, వాకింగ్‌ చేసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి