Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిననాటి కోరిక పెద్దయ్యాక నెరవేరింది.. మీ కలలను కూడా నిజం చేస్తామంటోన్న రిచర్డ్ బ్రాన్సన్! అంతరిక్షయాత్రలో భాగమైన తెలుగమ్మాయి బండ్ల శిరీష

వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తన జీవితకాల కోరికను నెరవేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఆదివారం రోదసిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిలో తెలుగమ్మాయి బండ్ల శిరీష కూడా భాగస్వామ్యమైంది.

చిననాటి కోరిక పెద్దయ్యాక నెరవేరింది.. మీ కలలను కూడా నిజం చేస్తామంటోన్న రిచర్డ్ బ్రాన్సన్! అంతరిక్షయాత్రలో భాగమైన తెలుగమ్మాయి బండ్ల శిరీష
Billionaire Richard Branson And Bandla Sirisha
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Jul 12, 2021 | 6:26 PM

Billionaire Richard Branson: వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తన జీవితకాల కోరికను నెరవేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఆదివారం రోదసిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిలో తెలుగమ్మాయి బండ్ల శిరీష కూడా భాగస్వామ్యమైంది. వ్యోమనౌన వీఎస్ఎస్ యూనిటీ-22 నింగిలోకి దూసుకెళ్లి, విజయవంతంగా తిరిగి భూమిని చేరుకుంది. వీరితోపాటు మిషన్ స్పెషలిస్టులు వర్జిన్ గెలాక్టిక్ ఛీప్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోజెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కోలిన్ బెన్నెట్‌ జర్నీ చేశారు. VSS-యూనిటీ-22 ను వీఎంఎస్-ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. దాదాపు 90 నిమిషాలపాటు ఈ యాత్ర సాగింది. సామాన్యులను అందరిక్షంలోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేసినట్లు వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ప్రకటించాడు. అలాగే అంతరిక్షలోకి మానవ సహితంగా వెళ్లిన తొలి వ్యోమనౌకగా గుర్తింపు పొందింది.

Billionaire Richard Branson And Bandla Sirisha (2)

అయితే, రోదసీ ప్రయాణంలో ఆయన మాట్లాడుతూ, ‘నా చిన్నతనం నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, చుక్కల దగ్గరకు వెళ్లి వాటిని చూడాలినే కోరిక ఉండేది. ప్రస్తుతం పెద్దవాడిని అయ్యాక ఆ కోరిక నెరవేరింది. చాలా ఎత్తు నుంచి మన అందమైన భూమిని చూడడం ఎంతో అద్భుతంగా అనిపించింది. నాకల నిజంగా నేడు నిజమైంది. భవిష్యత్తు తరాల్లో ఎవరైనా ఇలాంటి కలలతో ఉంటే.. వాటిని మేం నిజం చేస్తామని, మేం మాకలను ఎలా నెరవేర్చుకున్నామో చూడండని’ జర్నీలో మాట్లాడారు.

Billionaire Richard Branson And Bandla Sirisha (1)

ఈ వ్యోమనౌకతో భవిష్యత్తుల్లో మరిన్ని ప్రయాణాలు చేసేందుకు రిచర్డ్ బ్రాన్సన్ ప్లాన్ చేస్తున్నాడు. ముందుముందు జరిగే ప్రయాణాల్లో సామాన్యులకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నాడు. ఈ అంతరిక్ష పర్యటనలో 34 ఏళ్ల బండ్ల శిరీష భాగమై, తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచింది. భారత్ నుంచి అంతరిక్షానికి దూసుకెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర క్రియోట్ చేసింది. గుంటూరుకు చెందిన బండ్ల శిరీష.. కొన్నాళ్లుగా వర్జిన్ గెలాక్టిక్ లో ప్రభుత్వ వ్యవహారాలు, రీసెర్చ్ ఆపరేషన్ల విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2015లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్ గా వర్జిన్ గెలాక్టిక్ లో చేరారు.

Also Read:

Virgin Galactic: అంతరిక్షయాత్ర విజయవంతం.. రోదసీలోకి వెళ్లి వచ్చిన బండ శిరీష

Virgin Galactic: చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి.. నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమ‌నౌక VSS యూనిటీ-22..