AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virgin Galactic: అంతరిక్షయాత్ర విజయవంతం.. రోదసీలోకి వెళ్లి వచ్చిన బండ శిరీష

తెలుగు తేజం బండ శిరీష సరికొత్త చరిత్ర సృష్టించింది. రోదసియానం చేసి దేశానికి గర్వకారణంగా నిలిచింది. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష యాత్ర విజయవంతం కావడంతో ప్రశంసలు వెలువెత్తాయి.

Virgin Galactic: అంతరిక్షయాత్ర విజయవంతం.. రోదసీలోకి వెళ్లి వచ్చిన బండ శిరీష
Bandla Shirisha Thumb
Sanjay Kasula
|

Updated on: Jul 11, 2021 | 10:14 PM

Share

రోదసి లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించారు తెలుగు అమ్మాయి బండ్ల శిరీష . అంతరిక్షంలోకి చక్కర్లు కొట్టి తిరిగి భూమిని చేరుకుంది, రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా శిరిష రికార్డు సృష్టించింది. కొద్దిగా ఆలస్యమైనప్పటికి వ్యోమనౌక VSS యూనిటీ-22 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ , మిషన్ స్పెషలిస్టులు వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోజెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కోలిన్ బెన్నెట్‌తో కలిసి శిరీష స్పేస్‌ జర్నీ చేశారు. గంటసేపు అంతరిక్షంలో గడిపారు శిరీష అండ్‌ కంపెనీ.

మానవ సహిత వ్యోమనౌక VSS-యూనిటీ-22ను VMS-ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. 90 నిముషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగింది . సామాన్యులను రోదసీ లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ ప్రకటించారు. 34 ఏళ్ల బండ్డ శిరీష తెలుగు వాళ్లందరికి గర్వకారణంగా నిలిచారు. తొలిసారి అంతరిక్షం లోకి మానవులను తీసుకెళ్లిన ప్రయోగంగా యూనిటీ -22 రికార్డు సృష్టించింది.

భారత్‌ నుంచి అంతరిక్షానికి దూసుకెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు. 90 కిలోమీటర్ల ఎత్తుకు ఈ వ్యోమనౌక ప్రయాణం చేసింది. భూ వాతావరణానికి , అంతరిక్షానికి బోర్డర్‌గా భావించే కర్మాన్‌ రేఖను దాటి ప్రయాణం చేసింది. ఇలా స్పేస్‌ జర్నీ చేసిన వాళ్లనే వ్యోమగాములుగా పరిగణిస్తారు.

కొద్దిసేపు వాళ్లు భారరహిత స్థితికి చేరుకుంటారు. సామాన్యులకు రోదసీయానం అవకాశం ఇచ్చేందుకు ఈ జర్నీ చేసినట్టు వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రకటించింది. గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. పర్‌డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటికల్‌-ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు.

ప్రస్తుతం ఆమె వర్జిన్‌ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. శిరీష అంతరిక్షయానం గురించి తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుంచి మనమ్మాయ్..స్పేస్‌లోకి వెళ్లడం గర్వకారణమని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: Monsoon Rain: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం.. చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడే..

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 465 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా