Car Robbery: 60 సెకన్లలోనే కారు దొంగతనం.. వామ్మో వీళ్లు మామూలు దొంగలు కాదు.. సీసీ టీవీలో రికార్డ్..
Car Robbery: దీనిపై చౌహాన్ పోలీసుకుల ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చౌహాన్ ఒక ఇమెయిల్ స్క్రీన్ షాట్‌ను కూడా పంచుకున్నారు. జూన్ 21, 2025న 60 సెకన్లలో దొంగిలించారు. నా CCTV నుండి ఈ వీడియోలో..

న్యూఢిల్లీలో తెల్లవారుజామున కేవలం 60 సెకన్లలోపే హ్యుందాయ్ క్రెటా కారు దొంగిలించారు దుండగులు. ఏంటి 60 సెకన్లలోనే దొంగిలించారా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. నిమిషం లోపు కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి వాహనం భద్రతా వ్యవస్థను హ్యాక్ చేసి, దానిని దొంగిలించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రిషబ్ చౌహాన్ అనే యూజర్ జూన్ 21 నాటి CCTV ఫుటేజ్‌ను షేర్ చేశాడు. సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంటి బయట పార్క్ చేసిన తన కారు దొంగిలించినట్లు వీడియోలో చూడవచ్చు. అతను హ్యుందాయ్ క్రెటాను కొనవద్దని ఇతరులను కూడా హెచ్చరించాడు.
ఇది కూడా చదవండి: BSNL ప్లాన్ కేవలం రూ.7కే.. 84 రోజుల వ్యాలిడిటీ.. డైలీ 3జీబీ డేటా!
వీడియోలో చౌహాన్ వాహనం పక్కన వేరే దిశ నుండి ఒక కారు వస్తున్నట్లు కనిపిస్తుంది. అందులో ఒకరు బయటకు వచ్చి, డ్రైవర్ వైపు కిటికీ పగలగొట్టి ఆపై వెళ్లిపోతారు. కొన్ని నిమిషాల తర్వాత అదే కారు తిరిగి వచ్చి మళ్ళీ క్రెటా పక్కన పార్క్ చేస్తుంది. ఈసారి ముసుగు ధరించిన వేరే వ్యక్తి బయటకు వచ్చి వాహనం భద్రతా వ్యవస్థను హ్యాక్ చేసి కారును విజయవంతంగా అన్‌లాక్ చేస్తాడు. ఇలా క్షణాల్లోనే కారును దొంగిలించేశారు.
View this post on Instagram
దీనిపై చౌహాన్ పోలీసుకుల ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చౌహాన్ ఒక ఇమెయిల్ స్క్రీన్ షాట్‌ను కూడా పంచుకున్నారు. తన క్యాప్షన్‌లో అతను ఇలా రాశారు. “హాయ్, నా హ్యుందాయ్ క్రెటా జూన్ 21, 2025న 60 సెకన్లలో దొంగిలించారు. నా CCTV నుండి ఈ వీడియోలో చూసినట్లుగా, క్రెటా బయట పార్క్ చేసినప్పుడు ఇకపై సురక్షితం కాదు. దీని భద్రతా వ్యవస్థ హ్యాక్ చేయబడినట్లు లేదా లీక్ అయినట్లు కనిపిస్తుంది. ఒక నిమిషంలోపు ఇది జరిగిపోయింది. అంటూ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇంట్లో వింత శబ్దాలు.. ఫ్రిజ్ వెనుకాల చూడగానే ముచ్చెమటలు పట్టేశాయ్.. వీడియో వైరల్
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








