Tech Tips: దొంగలించిందా.. మంచిదా.. ఫోన్ కొనేముందు ఇవి తప్పక చెక్ చేయండి..
సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త చాలా ముఖ్యం. దొంగిలించిన ఫోన్‌లు, నకిలీ బ్యాటరీలతో మోసపోకుండా ఉండాలంటే, IMEI నంబర్, భౌతిక స్థితి, బ్యాటరీ ఆరోగ్యం, కెమెరా, నెట్‌వర్క్ వంటివి తప్పకుండా తనిఖీ చేయాలి. అసలు బిల్లు, బాక్స్ అడగడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు. ఈ జాగ్రత్తలతో మంచి ఫోన్‌ను పొందవచ్చు.

మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. చాలా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో కొత్తగా కనిపించే చాలా ఫోన్‌లలో దొంగిలించిన ఫోన్‌లు, నకిలీ పార్ట్స్, బ్యాటరీలు, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న IMEIలు వంటి సమస్యలు ఉండవచ్చు. ఇవి తెలుసుకోకుండా కొంటేన తరువాత తీవ్రమైన ఇబ్బందులకు దారితీయవచ్చు.
సెకండ్ హ్యాండ్ కొనేముందు ఈ 5 ముఖ్యమైన అంశాలను తప్పకుండా చెక్ చేయండి..
IMEI నంబర్‌ను చెక్ చేయండి:
ఉపయోగించిన ఫోన్‌ను కొనే ముందు చేయవలసిన మొదటి, అతి ముఖ్యమైన పని IMEI నంబర్‌ను తనిఖీ చేయడం. ఏదైనా ఆన్‌లైన్ IMEI చెకర్ లేదా ప్రభుత్వ పోర్టల్‌లో IMEI నంబర్‌ను నమోదు చేసి.. ఫోన్ బ్లాక్‌లిస్ట్‌లోఉందో లేదో నిర్ధారించుకోవాలి. దొంగిలించిన ఫోన్‌లు కొనుగోలు చేయడం వలన పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి రావచ్చు.
ఫోన్ భౌతిక స్థితిని పరిశీలించడం
ఫోన్ బాడీ ఫ్రేమ్, స్క్రీన్, కెమెరా గ్లాస్, బటన్లను జాగ్రత్తగా తనిఖీ చేయండి. స్క్రీన్ రీప్లేస్‌మెంట్, బాడీ పాలిష్ వల్ల ఫోన్ కొత్తగా కనిపించవచ్చు. మైక్రో-స్క్రాచెస్, డెంట్లు, విరిగిన కెమెరా గ్లాస్ లేదా స్క్రీన్ రంగు మారడం వంటి సంకేతాలు ఫోన్ తీవ్రంగా పడిపోయిందని లేదా ఎక్కువగా ఉపయోగించిందని సూచిస్తాయి. ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్‌ను కూడా తప్పకుండా చెక్ చేయండి.
బ్యాటరీ హెల్త్ – ఛార్జింగ్ టెస్ట్
పాత ఫోన్‌లలో అతిపెద్ద సమస్య బలహీనపడిన బ్యాటరీ. బ్యాటరీ సామర్థ్యం తగ్గితే ఫోన్ త్వరగా డిశ్చార్జ్ అవ్వడం, వేడెక్కడం జరుగుతుంది. ఐఫోన్ సెట్టింగ్‌లలో నేరుగా బ్యాటరీ ఆరోగ్యాన్ని తనిఖీ చేయవచ్చు. థర్డ్-పార్టీ టూల్స్ లేదా సర్వీస్ సెంటర్ నివేదికల ద్వారా బ్యాటరీ సైకిల్ కౌంట్, పనితీరును తనిఖీ చేయవచ్చు. ఛార్జింగ్ వేగం నెమ్మదిగా ఉంటే లేదా ఛార్జ్ త్వరగా దిగిపోతుంటే.. బ్యాటరీ చెడిపోయిందని అర్థం.
కెమెరా, స్పీకర్లు, నెట్‌వర్క్ టెస్ట్
ఫోన్ ఫీచర్లను టెస్ట్ చేయడం చాలా ముఖ్యం. అన్ని కెమెరా మోడ్‌లను పరీక్షించి, ఫోటో నాణ్యతను అంచనా వేయండి. కెమెరా మాడ్యూల్స్ భర్తీ చేస్తే పనితీరు తగ్గుతుంది. కొనే ముందు సిమ్ కార్డు పెట్టి, ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడండి. మైక్రోఫోన్, స్పీకర్ బాగా పనిచేస్తున్నాయో లేదో తెలుస్తుంది. : సిగ్నల్ బాగా వస్తుందో లేదో కూడా చెక్ చేయాలి.
అసలు బిల్లు, బాక్స్ అడగండి
పాత ఫోన్ అయినా తప్పకుండా దాని అసలు బిల్లు, బాక్స్ ఉంటే అడగండి. బిల్లు ఉంటే ఆ ఫోన్ ఎవరిదో తెలుస్తుంది. ఫోన్‌కు ఇంకా వారంటీ ఉంటే తరువాత రిపేర్ చేయించుకోవడానికి సులభంగా ఉంటుంది. బాక్స్ మీద ఉన్న IMEI నంబర్ ఫోన్ IMEI నంబర్ ఒకటే ఉండాలి.
ఈ విషయాలు గుర్తుంచుకుంటే, మీరు మంచి సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను తక్కువ ధరకే సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




