AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నైట్‌ మొత్తం మీ ఛార్జర్‌ను ప్లగ్-ఇన్‌లో ఉంచుతున్నారా?.. జాగ్రత్త.. యమపాశం మీ వెంటే..

చాలా మంది తమ సెల్ ఫోన్‌లను ఛార్జర్ సాకెట్ నుండి తీసిన తర్వాత కూడా స్విచ్ ఆఫ్ చేయరు. ఛార్జర్ ప్లగ్ ఇన్ చేసి స్విచ్ ఆన్ చేసి అలానే పెడతారు. ఇలా ఉంచడం వల్ల ఎంత ప్రమాదమో చాలా మందికి తెలియదు. కాబట్టి దీన్ని ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి. వాటని బారీన పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలసుకుందాం.

నైట్‌ మొత్తం మీ ఛార్జర్‌ను ప్లగ్-ఇన్‌లో ఉంచుతున్నారా?.. జాగ్రత్త.. యమపాశం మీ వెంటే..
Mobile Charging Safety
Anand T
|

Updated on: Oct 08, 2025 | 6:12 PM

Share

ప్రజలు తమ సెల్ ఫోన్‌లను ఛార్జ్ చేసేటప్పుడు అనేక తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుడు సెల్ ఫోన్‌కే కాకుండా మనకు కూడా ప్రమాదకరంగా మారవచ్చు. కొంతమంది రాత్రంతా సెల్ ఫోన్‌లను ఛార్జ్ చేస్తూ నిద్రపోతారు. అలా చేయడం చాలా ప్రమాదకరం. రాత్రంతా సెల్ ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల సెల్ ఫోన్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల సెల్ ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా, చాలా మంది ఛార్జర్ నుండి ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేసి , సాకెట్లను అలాగే ఉంచుతారు. ఇలా చేయడం ద్వారా విద్యుత్తు ఉపయోగించబడుతుంది. స్పష్టంగా చెప్పాలంటే, ఛార్జ్ చేయడానికి ప్లగ్ ఇన్ చేసినా చేయకపోయినా విద్యుత్తు ఖర్చు అవుతుంది. ఈ అలవాటు మీ విద్యుత్ బిల్లును పెంచడమే కాకుండా మీకు విద్యుత్ షాక్ కూడా కలిగించవచ్చు.

కొంతమంది తమ సెల్ ఫోన్‌లను వేగంగా ఛార్జ్ చేసుకోవడానికి ఫాస్ట్‌ ఛార్జర్‌లను ఉపయోగిస్తారు. ఇలాంటి ఛార్జర్‌లు మీకు విద్యుత్ షాక్‌ను ఇవ్వగలవు. దీనివల్ల అవి షార్ట్ సర్క్యూట్ లేదా పేలిపోవచ్చు. కాబట్టి, మీ సెల్ ఫోన్‌ను ఛార్జర్ నుండి తీసివేసిన తర్వాత, దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. ఇది మీకు కొద్దిగా విద్యుత్ ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ ఖర్చులను కూడా తగ్గిస్తుంది.

మీరు ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కువసేపు ఛార్జర్ ఉపయోగిస్తుంటే, మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. చాలా మంది మంచం లేదా సోఫాపై కూర్చుని, మొబైల్ ఛార్జ్ చేయడానికి కేబుల్ లాగి పట్టుకుంటారు ఇది మంచిది కాదు. ఇలా ఛార్జర్‌ను ఒకేసారి లాగడం వల్ల కేబుల్ తెగి షార్ట్ సర్క్యూట్‌కు జరిగే ప్రమాదం ఉంటుంది.

అదేవిధంగా, ఛార్జర్‌ను తడి లేదా నీటితో నిండిన ఉపరితలంపై ఎప్పుడూ ఉంచవద్దు. అలాగే ఛార్జర్ తడిస్తే, దానిని ఉపయోగించే ముందు పూర్తిగా ఆరబెట్టండి. రాత్రి పడుకునే ముందు దాన్ని ఆఫ్ చేయడం లేదా రాత్రంతా సెల్ ఫోన్‌ను ఛార్జర్‌పై ఉంచడం మంచిది కాదు. దీనివల్ల సెల్ ఫోన్ జీవితకాలం తగ్గుతుంది. లేకపోతే, పేలుళ్లు వంటి ప్రమాదాలు సంభవించవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.