AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI brain decoder: మెదడును వేగంగా చదివేసే ఏఐ టెక్నాలజీ.. ఆ వ్యాధి బాధితులకు ఎంతో ఉపయోగం

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో అనేక అద్బుతాలు జరుగుతున్నాయి. దీన్ని ఉపయోగించి చాలా సులువుగా అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు. ఈ నేపథ్యంలో వ్యక్తి ఆలోచనలను టెక్స్ట్ గా మార్చడానికి ఏఐని ఉపయోగించే బ్రెయిన్ డీకోడర్ కు శాస్త్రవేత్తలు కొత్త మెరుగుదల చేశారు. దీని ద్వారా ఒక్క స్కాన్ తో వ్యక్తి ఆలోచనలను చదువొచ్చు. గంటల తరబడి శిక్షణ అవసరం లేకుండానే ఆలోచనలను టెక్ట్స్ లోకి మార్చుకోవచ్చు. దీని ద్వారా మెదడుపై ఇప్పటికే ఉన్న డీకోడర్లకు త్వరగా శిక్షణ ఇవ్వవచ్చని పరిశోధకులు తెలిపారు.

AI brain decoder: మెదడును వేగంగా చదివేసే ఏఐ టెక్నాలజీ.. ఆ వ్యాధి బాధితులకు ఎంతో ఉపయోగం
Ai Brain Decoder
Nikhil
|

Updated on: Feb 20, 2025 | 7:54 PM

Share

అఫాసియాతో బాధపడుతున్న వారి ఆలోచనలను పదాలుగా మార్చడానికి లేటెస్ట్ టెక్నాలజీ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. సాధారణగా బ్రెయిన్ డీకోడర్ ఒక వ్యక్తి ఆలోచనలను పదాలుగా మార్చడానికి మెషీన్ లెర్నింగ్ ను ఉపయోగిస్తుంది. వారు విన్న కథలకు మెదడు ప్రతిస్పందనలను గుర్తిస్తుంది. అమెరికాలో దాదాపు ఒక మిలియన్ మంది ప్రజలు అఫాసియాతో బాధపడుతున్నారు. వీరు తమ ఆలోచనలను పదాలుగా మార్చడానికి, భాషను అర్థం చేసుకోవడానికి కష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మెదడుకు సంబంధించిన రుగ్మత.

ఆస్థిన్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో పనిచేస్తున్నఇద్దరు శాస్త్రవేత్తలు కొత్త ఏఐ ఆధారిత సాధనాన్ని కనుగొన్నారు. దీని వల్ల ఒక వ్యక్తి మాట్లాడే పదాలను అర్థం చేసుకోకుండానే అతడి ఆలోచనలను పదాల్లోకి అనువదించవచ్చు. తక్కువ సమయంలో ఇది సాధ్యమవుతుంది. గతంలోనూ ఇలాంటి బ్రెయిన్ డీకోడర్లు అందుబాటులో ఉన్నాయి. ఒక వ్యక్తి మొదడు కార్యకలాపాలను నిరంతరం పదాల్లోకి అనువదించడానికి చాట్ జీటీపీని ఉపయోగించే ఒకరకమైన ట్రాన్స్ ఫార్మర్ మోడల్ తో ఒక వ్యవస్థను కొందరు తీసుకువచ్చారు. దీని ద్వారా అతడు ఆడియో వింటున్నా, కథ చెప్పాలనుకుంటున్నా, వీడియోను చూస్తున్నా వచనాన్ని తయారు చేయగలదు. కానీ దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ మెదడు డీకోడర్ కు శిక్షణ ఇవ్వడానికి, పాల్గొనేవారు దాదాపు 16 గంటలు ఎఫ్ ఎంఆర్ఐ స్కానర్ లో కదలకుండా పడుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది సాధ్యం కాదు.

తాజా అప్ డేట్ తో ఈ విధానం మరింత మెరుగ్గా అందుబాటులోకి వచ్చింది. పిక్చర్ షార్ట్ ల వంటి చిన్న, నిశ్శబ్ద వీడియోలు చూస్తున్నప్పుడు ఎఫ్ఎంఆర్ఐ స్కానర్ లో కేవలం ఒక గంట శిక్షణతో ఫలితాలు సాధించవచ్చు. కొత్త వ్యక్తికి ఇప్పటికే ఉన్న బ్రెయిన్ డీకోడర్ ను, శిక్షణ ఇచ్చే పద్దతిని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ కన్వర్టర్ అల్గారిథమ్ ద్వారా తక్కువ సమయంలో బ్రెయిన్ ను డీకోడ్ చేయడానికి వీలు కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి