AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Apps Banned: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 119 మొబైల్‌ యాప్స్‌ బ్యాన్‌!

Mobile Apps Banned: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 119 మొబైల్‌ యాప్స్‌ను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన చాలా యాప్‌లు ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. నివేదిక ప్రకారం, ఇప్పటివరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి 15 యాప్‌లను మాత్రమే తొలగించారు..

Mobile Apps Banned: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 119 మొబైల్‌ యాప్స్‌ బ్యాన్‌!
Subhash Goud
|

Updated on: Feb 21, 2025 | 2:13 PM

Share

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి చైనా లింక్డ్ మొబైల్ యాప్‌లపై డిజిటల్ స్ట్రైక్ చేసింది. ప్రభుత్వం ఒకేసారి 119 చైనీస్ మొబైల్ యాప్‌లను నిషేధించింది. తొలగించిన యాప్‌లలో ప్రధానంగా వీడియో, వాయిస్ చాట్ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఈ ఈ మొబైల్‌ యాప్‌లలో ఎక్కువ భాగం చైనీస్, హంకాంగ్ యాప్‌లు ఉన్నాయి.

మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. ఇంత పెద్ద సంఖ్యలో మొబైల్‌లను నిషేధించాలనే నిర్ణయం 2020 సంవత్సరం తర్వాత వచ్చింది. ఆ సమయంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా చైనీస్ యాప్‌లపై నిషేధాన్ని ప్రకటించింది. వీటిలో టిక్‌టాక్, షేర్‌ఐ వంటి ప్రసిద్ధ యాప్‌లు ఉన్నాయి. గతసారి లాగే, ఈసారి కూడా జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ మొబైల్ యాప్‌లను నిషేధించారు.

ప్రభుత్వం మొబైల్ యాప్‌లను ఎప్పుడు నిషేధించింది?

20 జూన్ 2020న ప్రభుత్వం దాదాపు 100 చైనీస్ యాప్‌లను నిషేధించింది. 2021, 2022 సంవత్సరాల్లో కూడా చైనీస్ మొబైల్ యాప్‌లపై ఇలాంటి నిషేధం విధించింది. అయితే, ఆ సమయంలో నిషేధించబడిన మొబైల్ యాప్‌ల సంఖ్య తక్కువగా ఉంది.

ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద మొబైల్ యాప్‌లను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. సింగపూర్, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన కొన్ని యాప్‌లను నిషేధించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A జాతీయ భద్రత, ప్రజా క్రమం కారణంగా ఆన్‌లైన్ కంటెంట్ యాక్సెస్‌ను నిషేధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది.

నిషేధించిన చాలా యాప్‌లు ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. నివేదిక ప్రకారం, ఇప్పటివరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి 15 యాప్‌లను మాత్రమే తొలగించారు. భారత ప్రభుత్వం బ్లాక్ చేసిన 119 యాప్‌లలో కేవలం మూడు యాప్‌ల పేర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో సింగపూర్‌కు చెందిన వీడియో చాట్, గేమింగ్ ప్లాట్‌ఫామ్ చిల్‌చాట్, చైనీస్ డెవలపర్ చాంగ్‌యాప్, ఆస్ట్రేలియన్ యాప్ హనీకామ్ ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా నిషేధించిన యాప్‌ల జాబితాను ప్రభుత్వం విడుదల చేయలేదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి