Umesh Yadav: చిన్నారి రాకుమారికి స్వాగతం పలుకుతున్న టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్… ఎందుకో తెలుసా..?
‘ఈ ప్రపంచానికి స్వాగతం.. చిన్నారి రాకుమారి! నువ్వొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని టీమ్‌ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

‘ఈ ప్రపంచానికి స్వాగతం.. చిన్నారి రాకుమారి! నువ్వొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని టీమ్‌ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఇందుకు కారణం ఎంటంటే… ఉమేష్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి సతీమణి తాన్యా వధ్వా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పంజాబ్‌కు చెందిన తాన్యా, ఉమేశ్ ప్రేమించుకొన్నారు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారికిప్పుడు సంతానం కలిగింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అతడి ఎడమకాలి పిక్క కండరాలకు గాయమైంది. దీంతో ఉమేష్ మైదానాన్ని వీడాడు. ఫిజియో వచ్చి పరీక్షించి డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడు బౌలింగ్ చేయడానికి రాలేదు. కోలుకొనేందుకు ఎక్కువ సమయం పడుతుందని తెలియడంతో భారత్‌కు పంపించారు. అతడి స్థానంలో నటరాజన్ ఎంపికైన సంగతి తెలిసిందే.
ఉమేష్ యాదవ్ ట్వీట్…
It’s a girl. ?????? pic.twitter.com/mdorY5nBUv
— Umesh Yaadav (@y_umesh) January 1, 2021
Also Read: Virat Kohli : హార్డ్ హిట్టర్‌తో కొహ్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్… ఆశలు, ఆనందం అందాలని ఆకాంక్ష…