ISL 2020-21 : పాయింట్ల పట్టికలో 10 వ స్థానం..మిగతా సీజన్ కోసం నైజీరియా ఆటగాడితో ఈస్ట్ బెంగాల్ ఒప్పందం

ఇండియన్‌ సూపర్‌ లీగ్ 2020-21 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ కైవసం చేసుకునేందుకు అన్ని జట్లు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 9:46 pm, Fri, 1 January 21
ISL 2020-21 : పాయింట్ల పట్టికలో 10 వ స్థానం..మిగతా సీజన్ కోసం నైజీరియా ఆటగాడితో ఈస్ట్ బెంగాల్ ఒప్పందం

ఇండియన్‌ సూపర్‌ లీగ్ 2020-21 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ కైవసం చేసుకునేందుకు అన్ని జట్లు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. సరిగా ఆకట్టుకోలేకపోతున్న ఎఫ్‌సీ ఈస్ట్ బెంగాల్ నైజీరియా ప్లేయర్‌ను కొనుగోలు చేసింది. నైజీరియా యువ ఫార్వర్డ్ బ్రైట్ ఎనోబాఖరే అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు శుక్రవారం వెల్లడించింది. 22 ఏళ్ల ఎనోబాఖరే చివరిగా గ్రీక్ క్లబ్ ఏఈకే ఏథెన్స్ తరపున బరిలోకి దిగాడు.  వోల్వర్‌హాంప్టన్ జట్టు తరఫున 43 మ్యాచులు ఆడి.. మూడు గోల్స్ మాత్రమే చేశాడు. ఎనోబాఖరే జట్టులోకి రావడంపై ప్రధాన కోచ్ రాబీ ఫౌలర్ సంతోషం వ్యక్తం చేశాడు.ఈస్ట్ బెంగాల్ భారతదేశంలో అతిపెద్ద క్లబ్ అని… అందులో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు ఎనోబాఖరే.

ఈస్ట్ బెంగాల్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో 10వ స్థానంలో ఉంది. ఆడిన ఏడు మ్యాచులలో మూడు డ్రాలు, నాలుగు ఓటములను తీవ్ర విమర్శలు ఎదుర్కుంటుంది. న్యూ ఇయర్ నేపథ్యంలో గురువారం, శుక్రవారం మ్యాచ్‌లు షెడ్యూల్ చెయ్యలేదు. శనివారం కేరళ బ్లాస్టర్స్ , ముంబై సిటీ మధ్య పోరు జరగనుంది.

 

Also Read :