AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Temple Destroyed In Pak: కూల్చివేసిన హిందూ దేవాలయాన్నితిరిగి నిర్మిస్తాం.. పాకిస్థాన్‌ సంచలన ప్రకటన

Hindu Temple Destroyed In Pak: పాకిస్థాన్‌లో ఓ హిందూ దేవాలయాన్ని కొంత మంది స్థానికులు ధ్వసం చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తీవ్ర నిరసనలు ...

Hindu Temple Destroyed In Pak: కూల్చివేసిన హిందూ దేవాలయాన్నితిరిగి నిర్మిస్తాం.. పాకిస్థాన్‌ సంచలన ప్రకటన
Subhash Goud
|

Updated on: Jan 01, 2021 | 9:55 PM

Share

Hindu Temple Destroyed In Pak: పాకిస్థాన్‌లో ఓ హిందూ దేవాలయాన్ని కొంత మంది స్థానికులు ధ్వసం చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో పాటు భారత్‌ నుంచి కూడా ఒత్తిడిలు పెరిగాయి. దీంతో ఆలయాన్ని తిరిగి‌ నిర్మించనున్నట్లు కైబర్‌ హక్తూన్‌క్వా ముఖ్యమంత్రి మహ్మద్‌ ఖాన్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. నిర్మాణం కూడా తొందరలోనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

ప్రభుత్వవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌ కైబర్‌ పక్తూన్‌క్వాలోని ,కరక్‌ జిల్లా తేరి గ్రామంలో బుధవారం కొంత మంది హిందూ దేవాలయాన్ని తగులబెట్టి తీవ్ర విధ్వంసం సృష్టించారు. తేరి గ్రామంలోని శ్రీపరమాహంసజీ మహరాజ్‌ సమాధిని, కృష్ణ ద్వార మందిరాన్ని ముస్లిం మత సంస్థల ఆధ్వర్యంలో స్థానిక ముస్లింలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, హిందూ సంఘాలు తీవ్ర నిరసనలు తెలిపాయి. మరో వైపు పాక్‌ చీఫ్‌ జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌కు ఈ సంఘటన గురించి ఆదేశంలోని మైనార్టీ ప్రజాప్రతినిధి రమేష్‌ కుమార్‌ తెలియజేశారు.

కాగా, దేవాలయ ధ్వంసానికి పాల్పడ్డ 26 మంది నిందితులతో పాటు ఉలేమా ఏ ఇస్లామ్‌ నేత రెహ్మత్‌ సలామ్‌ ఖట్టక్‌ను అరెస్టు చేసినట్లు కైబర్‌ పక్తూన్‌క్వా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో 350 మంది పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై పాక్‌ సుప్రీం కోర్టు గురువారం హిందూ దేవాలయం కూల్చివేతపై ఆరా తీసింది. దీనిపై జనవరి 5న విచారణ చేపట్టనుంది.

Prisoners List: భారత్‌, పాకిస్థాన్‌ జైల్లో మగ్గుతున్న ఖైదీల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న ఇరు దేశాలు