Prisoners List: భారత్‌, పాకిస్థాన్‌ జైల్లో మగ్గుతున్న ఖైదీల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న ఇరు దేశాలు

Prisoners List: పాకిస్థాన్‌ జైల్లో మగ్గుతున్న 319 మంది భారత ఖైదీల జాబితాను పాక్‌ ప్రభుత్వం శుక్రవారం భారత్‌కు అందజేసింది. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ...

Prisoners List: భారత్‌, పాకిస్థాన్‌ జైల్లో మగ్గుతున్న ఖైదీల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న ఇరు దేశాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 01, 2021 | 7:32 PM

  • భారత్‌కు చెందిన 319 మంది ఖైదీలు పాక్‌లో

  • పాక్‌కు చెందిన 340 మంది ఖైదీలు భారత్‌లో

Prisoners List: పాకిస్థాన్‌ జైల్లో మగ్గుతున్న 319 మంది భారత ఖైదీల జాబితాను పాక్‌ ప్రభుత్వం శుక్రవారం భారత్‌కు అందజేసింది. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు ఈ ఖైదీల జాబితాను అందజేసింది. ఇందులో భాగంగా 270 మంది జాలర్లు ఉండగా, మరో 49 మంది ఇతర పౌరులు ఉన్నారు. 2008 మే 21న ఇరుదేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం భారత్‌, పాకిస్థాన్‌ ప్రతియేటా జనవరి 1న జూలై 1న తమ దేశాల్లోని ఖైదీల వివరాలు అందజేసుకుంటారు. అయితే కాన్సులర్‌ యాక్సిస్‌ ఒప్పందం ప్రకారమే ఖైదీల వివరాలు వెల్లడించినట్లు విదేశాంగ కార్యాలయం (ఎఫ్‌ఓ) అధికారులు పేర్కొన్నారు.

పాక్‌ ప్రభుత్వం ఈ రోజు ఇస్తామాబాద్‌లోని భారత్‌ హైకమిషన్‌కు 319 మంది భారత్‌కు చెందిన ఖైదీల జాబితాను అందజేసింది. ఇందులో 270 మంది జాలర్లు, 49 మంది ఇతరులున్నారు.. అని తెలిపింది.

కాగా, భారత్‌లో సైతం ఇదే మాదిరిగా దేశంలోని జైళ్లల్లో ఉన్న 340 మంది పాకిస్థానీ ఖైదీల జాబితాను అందజేసింది. ఇందులో 77 మంది జాలర్లు, 263 మంది ఇతరులు ఉన్నారు. ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌కు ఈ జాబితాను భారత్‌ అందజేసినట్లు ఎఫ్‌ఓ వెల్లడించింది. అయితే భారత్‌ – పాకిస్థాన్‌ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఖైదీల వివరాలు ప్రతి ఆరు నెలలకోసారి అందజేసుకుంటుండటం గమనార్హం.

Donald Trump Visa Restrictions: వెళ్లే ముందు జోరు పెంచిన ట్రంప్‌.. విదేశీయులకు షాకిస్తూ కీలక నిర్ణయం