భారత బౌలర్‌ను కొనియాడిన పాక్ క్రికెటర్… ఐదు వికెట్లు తీసినందుకు అభినందనలు… ఎంతో ప్రతిభ ఉందని ప్రశంస…
బాక్సింగ్ డే టెస్టులో సిరాజ్ ఎంతో భావోద్వేగం చెంది ఉంటాడు, అరంగేట్రంలోనే అతడు అయిదు వికెట్లతో సత్తాచాటాడని, అతడిలో ఎంతో ప్రతిభ ఉందని పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడాడు.

బాక్సింగ్ డే టెస్టులో సిరాజ్ ఎంతో భావోద్వేగం చెంది ఉంటాడు, అరంగేట్రంలోనే అతడు అయిదు వికెట్లతో సత్తాచాటాడని, అతడిలో ఎంతో ప్రతిభ ఉందని పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో సిరాజ్ తన వ్యక్తిత్వాన్ని తెలియజేశాడని అక్తర్ తెలిపాడు. ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసి సిరాజ్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా విధి అతడిని పరీక్షించింది. జట్టుతో కలిసి సిడ్నీ క్వారంటైన్‌లో ఉన్న సమయంలో సిరాజ్ తండ్రి అనారోగ్యంతో మరణించారు.
భారత్‌కు వెళ్లి వస్తే క్వారంటైన్ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో అంత్యక్రియలకు హాజరుకాలేదు. భారత్ తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తే చూడాలనుకున్న తన తండ్రి కల కోసం.. బాధను భరిస్తూ ఆసీస్‌లోనే ఉండిపోయాడు. తండ్రిని కోల్పోయిన బాధను పంటి బిగువున భరిస్తూ బాక్సింగ్ డే టెస్టులో గొప్ప ప్రదర్శన చేశాడని ప్రశంసించాడు. ‘‘భారత్ తరఫున సిరాజ్ ఆడుతున్న క్షణాలను అతడి తండ్రి చూడాలని ఎంతో ఆశించాడని, కానీ అది జరగలేదని, అయితే సిరాజ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, గొప్ప ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. అలాంటి మధుర క్షణాలను అతడి తండ్రి చూడాల్సింది’’ అని అక్తర్ అన్నాడు.