Battery Swapping Stations: హెచ్‌పీ నుంచి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు… దేశ‌వ్యాప్తంగా 50 కేంద్రాల ఏర్పాటు…

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థ ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌, త్రీవీల‌ర్ వాహ‌నాల కోసం బ్యాట‌రీ స్వాపింగ్(బ్యాటరీ మార్పిడి ) కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నుంది.

Battery Swapping Stations: హెచ్‌పీ నుంచి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు... దేశ‌వ్యాప్తంగా 50 కేంద్రాల ఏర్పాటు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 02, 2021 | 6:05 AM

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థ ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌, త్రీవీల‌ర్ వాహ‌నాల కోసం బ్యాట‌రీ స్వాపింగ్(బ్యాటరీ మార్పిడి ) కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఇందుల‌కోసం బ్యాట‌రీ స్వాపింగ్ స‌ర్వీస్ సంస్థ వోల్టప్ తో ఒప్పదం కుద‌ర్చుకుంది. ఇందులో భాగంగా ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా జైపూర్‌లో రెండు ఈవీ బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేశారు. రాబోయే ఆరు నెలల్లో భారతదేశంలోని నగరాల్లో మొత్తం 50 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు సంస్థల భాగ‌స్వామ్యంతో ఎల‌క్ట్రిక్ వాహ‌న‌దారులు చివరి మైలు వర‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాలు చేయొవ‌చ్చు.

రెండు నిమిషాల్లోనే బ్యాట‌రీ మార్చుకోవ‌చ్చు..

హెచ్ పీసీఎల్ దేశవ్యాప్త నెట్‌వర్క్ తోపాటు వోల్టప్ సంస్థ బ్యాటరీ మార్పిడి సాంకేతికతలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాట‌రీ స్వాపింగ్ స్టేషన్లు వాలెట్-ఆధారిత పేమెంట్ సిస్టంను క‌లిగి ఉంటాయి. వోల్టప్ సంస్థ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. ఇవి ఈవీ బ్యాటరీ మార్పిడి స్టేష‌న్ల‌లో రెండు నిమిషాల కన్నా తక్కువ సమయంతో చార్జింగ్ అయిపోయిన బ్యాట‌రీను స్టేష‌న్‌లో అంద‌జేసి ఫుల్‌చార్జ్ ఉన్న బ్యాట‌రీని తీసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల చార్జింగ్ టైం ఆదా అవుతుంది. ఈ స్టేష‌న్లు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తి సేవ‌లు అందిస్తాయి. భారతీయ ఈవీ మార్కెట్ 2-3-వీలర్ల వాణిజ్య విభాగంలో గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధి ఉంటుంద‌ని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ఇవి స్లో చార్జింగ్ స‌మ‌స్యల‌ను అధిగ‌మించేందుకు ఈ బ్యాట‌రీ స్వాపింగ్ స్టేష‌న్లు ఉత్తమ ప్రత్యామ్నాయ మార్గమ‌ని పేర్కొంటున్నాయి.

Also Read:

LG Eyes A New TV Tech: ఎల్జీ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీ… త్వరలో క్యూఎన్ఈడీ టెక్నాలజీతో న్యూ వర్షన్…