AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 WITT Summit: క్రీడా రంగంలో రాణించాలంటే భారత్‌లో ఉన్న అవకాశాలేంటి..? వెటరన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాటల్లో..

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 అత్యంత ప్రత్యేక కార్యక్రమం 'వాట్ ఇండియా టుడే థింక్స్' తిరిగి వచ్చింది. ఈ అతిపెద్ద ప్రత్యేకమైన సమావేశం వచ్చే ఆదివారం ఫిబ్రవరి 25 నుండి దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఇది 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఈసారి కూడా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ముఖ్య అతిథిగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు.

TV9 WITT Summit: క్రీడా రంగంలో రాణించాలంటే భారత్‌లో ఉన్న అవకాశాలేంటి..? వెటరన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాటల్లో..
Pullela Gopichand
Balaraju Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 24, 2024 | 5:42 PM

Share

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 అత్యంత ప్రత్యేక కార్యక్రమం ‘వాట్ ఇండియా టుడే థింక్స్’ తిరిగి వచ్చింది. ఈ అతిపెద్ద ప్రత్యేకమైన సమావేశం వచ్చే ఆదివారం ఫిబ్రవరి 25 నుండి దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఇది 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఈసారి కూడా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ముఖ్య అతిథిగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, పాలన, క్రీడలు, వినోదాలకు సంబంధించిన అంశాలపై చర్చించి ప్రముఖులు తమ అభిప్రాయాలను వివరించనున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్, వెటరన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొననున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో భారతదేశం గర్వించేలా చేసిన ఆటగాళ్ల జాబితాలో పుల్లెల గోపీచంద్ పేరు ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఆటగాడిగా, కోచ్‌గా బ్యాడ్మింటన్ కోర్టులో భారతదేశం గర్వించదగ్గ ఆటగాళ్ళలో ఒకరైన 50 ఏళ్ల పుల్లెల గోపీచంద్ రెండు దశాబ్దాలకు పైగా క్రీడలో చురుకుగా రాణించారు. తాను ఎన్నో విజయాలు సాధించడమే కాకుండా ఎందరో యువతీయువకుల కలలను సాకారం చేసుకునేందుకు మార్గం చూపాడు.

చరిత్ర సృష్టించిన పుల్లెల గోపీచంద్

భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ సూపర్‌స్టార్, ప్రపంచ బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ పదుకొణె ద్వారా శిక్షణ పొందిన పుల్లెల కొన్ని సంవత్సరాల తర్వాత అదే స్థాయికి ఎదిగారు. 2001 సంవత్సరంలో పుల్లెల గోపీచంద్.. చైనాకు చెందిన చెన్ హాంగ్‌ను ఓడించి అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. తద్వారా పదుకొణె తర్వాత ప్రపంచ టైటిల్ గెలిచిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత ఏ ఆటగాడు దానిని పునరావృతం చేయలేకపోయాడు. అంతకుముందు 1998లో అతను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలలో కాంస్య పతకాలను కూడా గెలుచుకున్నారు.

యువతీయువకుల కలలు సాకారం..

కోర్టులో గొప్ప విజయాన్ని ప్రదర్శించిన తరువాత, పుల్లెల గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం చీఫ్ నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బాడ్మింటన్ అకాడమీ ద్వారా చాలా మంది ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. అతని పర్యవేక్షణ భారతదేశానికి సైనా నెహ్వాల్, పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, పి. కశ్యప్ వంటి గొప్ప ఆటగాళ్లు లభించారు. ఒలింపిక్స్ నుండి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల వరకు భారతదేశం గర్వపడేలా చేశారు. TV9 నెట్‌వర్క్‌ ఆధ్వరంలో నిర్వహిస్తున్న ఈవెంట్‌ ద్వారా బ్యాడ్మింటన్‌తోసహా ఇతర క్రీడలలో ప్రకాశించడానికి భారతదేశానికి ఎలా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయో తెలియజేస్తారు పుల్లెల గోపీచంద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..