WPL 2024: మంథాన నుంచి మెక్‌గ్రాత్ వరకు.. డబ్ల్యూపీఎల్‌ 2024లో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..

Womens Premier League 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండవ సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభైంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ సీజన్‌లో స్మృతి మంధాన, తహ్లియా మెక్‌గ్రాత్, మెగ్ లానింగ్, హేలీ మాథ్యూస్ నుంచి గొప్ప ప్రదర్శనలు ఆశిస్తున్నారు. లీగ్‌లో 5 జట్ల మధ్య మొత్తం 22 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. WPL 2024 ఫైనల్ మ్యాచ్ మార్చి 17న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. WPL రెండవ సీజన్‌లో మంచి ప్రదర్శన చేయగల ఐదుగురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

WPL 2024: మంథాన నుంచి మెక్‌గ్రాత్ వరకు.. డబ్ల్యూపీఎల్‌ 2024లో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..
WPL 2024
Follow us
Venkata Chari

|

Updated on: Feb 24, 2024 | 8:50 AM

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండవ సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడ్డాయి. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. లీగ్‌లో 5 జట్ల మధ్య మొత్తం 22 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. WPL 2024 ఫైనల్ మ్యాచ్ మార్చి 17న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. WPL రెండవ సీజన్‌లో మంచి ప్రదర్శన చేయగల ఐదుగురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

స్మృతి మంధాన (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన గత సీజన్‌లో ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితిలో, ఆమె ఈ సీజన్‌లో తన మార్క్‌ను చూపించాలని కోరుకుంటోంది. గత సీజన్‌లో, ఆమె 8 మ్యాచ్‌లలో 8 ఇన్నింగ్స్‌లలో 18.62 సగటు, 111.19 స్ట్రైక్ రేట్‌తో 149 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె అత్యధిక స్కోరు 37 పరుగులుగా నిలిచింది.

తహ్లియా మెక్‌గ్రాత్ (UP వారియర్స్)..

WPL 2023లో UP వారియర్స్ తరపున ఆస్ట్రేలియా క్రీడాకారిణి తహ్లియా మెక్‌గ్రాత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె 9 మ్యాచ్‌లలో 8 ఇన్నింగ్స్‌లలో 50.33 సగటు, 158.11 స్ట్రైక్ రేట్‌తో 302 పరుగులు చేసింది. ఈ సమయంలో తహ్లియా 4 అర్ధ సెంచరీలు చేసింది. గత సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 90* పరుగులు. WPL మొదటి సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రీడాకారిణిగా నిలిచింది.

మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్)..

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ WPL 2023లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది. ఆమె 9 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌లలో 2 అర్ధ సెంచరీల సహాయంతో 345 పరుగులు చేసింది. ఈ కాలంలో ఆమె 49.28 సగటు, 139.11 స్ట్రైక్ రేట్‌తో దంచి కొట్టింది. గత సీజన్‌లో అత్యధికంగా 50 ఫోర్లు కొట్టింది. జట్టు ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకంగా మారింది. అయితే, ముంబై చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

హేలీ మాథ్యూస్ (ముంబయి ఇండియన్స్)..

WPL 2023లో వెస్టిండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ బాల్, బ్యాటింగ్‌లో కీలక సహకారాన్ని అందించింది. గత సీజన్‌లో లీగ్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన ఆమె 16 వికెట్లు పడగొట్టింది. ఆమె అరంగేట్రం సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాయింట్‌గా నిలిచింది. ఇది కాకుండా, ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్ 10 మ్యాచ్‌లలో 1 అర్ధ సెంచరీ సహాయంతో 271 పరుగులు చేసింది.

సోఫీ ఎక్లెస్టోన్ (UP వారియర్స్)..

UP వారియర్స్ స్టార్ ప్లేయర్ సోఫీ ఎక్లెస్టోన్ WPL 2023లో కూడా గత సీజన్‌లో తన అద్భుతమైన ప్రదర్శనను పునరావృతం చేయాలనుకుంటుంది. ఎక్లెస్టోన్ గత సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 14.68 సగటుతో 16 వికెట్లు తీసింది. ఈ కాలంలో ఆమె చాలా పొదుపుగా కూడా బౌలింగ్ చేసింది. ఆమె ఎకానమీ రేటు కేవలం 6.61 మాత్రమే. ఈ ఇంగ్లిష్ బౌలర్ అంతర్జాతీయ టీ20లో 109 వికెట్లు పడగొట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..