K Hoysala: క్రీడా ప్రపంచంలో విషాదం.. గుండె పోటుతో కుప్పకూలిన యంగ్‌ క్రికెటర్‌.. గెలుపు సంబరాలు చేసుకుంటూనే..

ఈ మ్యాచ్‌లో తమిళనాడు జట్టుపై కర్ణాటక విజయం సాధించింది. ఈ సమయంలో జట్టుతో కలిసి సంబరాలు చేసుకుంటున్న హోయసల మైదానంలోనే ఛాతి నొప్పి వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం అంబులెన్స్‌లో బెంగళూరులోని బౌరింగ్‌ ఆస్పత్రికి తరలించారు.

K Hoysala: క్రీడా ప్రపంచంలో విషాదం.. గుండె పోటుతో కుప్పకూలిన యంగ్‌ క్రికెటర్‌.. గెలుపు సంబరాలు చేసుకుంటూనే..
K Hoysala
Follow us
Basha Shek

|

Updated on: Feb 24, 2024 | 7:09 AM

కర్ణాటకకు చెందిన వర్ధమాన క్రికెటర్‌ కె. హొయసల గుండెపోటుతో కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో కర్ణాటక, తమిళనాడు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తమిళనాడు జట్టుపై కర్ణాటక విజయం సాధించింది. ఈ సమయంలో జట్టుతో కలిసి సంబరాలు చేసుకుంటున్న హోయసల మైదానంలోనే ఛాతి నొప్పి వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం అంబులెన్స్‌లో బెంగళూరులోని బౌరింగ్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకోకముందే హొయసల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గురువారం ( ఫిబ్రవరి 22వ తేదీ) జరిగిన ఈ ఘటన శుక్రవారం ( ఫిబ్రవరి 23వ తేదీ) సాయంత్రం వెలుగులోకి వచ్చింది. యువ క్రికెటర్ అకాల మరణానికి కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి

‘కర్ణాటక వర్ధమాన క్రికెటర్ మరణ వార్త వినడం బాధాకరం. సౌత్ జోన్ టోర్నీ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ హోయసల ఏజిస్ గుండెపోటుతో మరణించాడు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులకు నా సానుభూతి. ఇటీవలి కాలంలో యువత గుండెపోటుకు గురవుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఈ సంఘటనలు ఆరోగ్య అవగాహన ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. కాబట్టి గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి యువకులకు సూచించారు.

క్రికెటర్ల సంతాపం..

హొయసల మృతికి మరో భారత మాజీ క్రికెటర్ అభిమన్యు మిథున్ సంతాపం తెలుపుతూ, ‘నేను ఇలా రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోయాము. అతను ప్రతిభావంతుడైన క్రికెటర్, మంచి శ్రద్ధగల స్నేహితుడు. చాలా త్వరగా పోయింది, హోయసలని ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడు’ అని నివాళి అర్పించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.