WPL 2024, MI vs DC: టాస్ గెలిచిన ముంబై.. అదరహో అనేలా ప్రారంభ వేడుకలు..
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ శుక్రవారం ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీని ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ముంబై టాస్ గెలిచి ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024) మొదటి మ్యాచ్ ముంబై, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతుంది. గత సంవత్సరం, మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి టోర్నమెంట్ ముంబైలో నిర్వహించబడింది. అయితే ఈసారి బెంగళూరు, ఢిల్లీలో మ్యాచ్ జరగనుండగా.. ముంబై జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

ప్రారంభ వేడుకలకు హాజరైన పలువురు స్టార్లు..
ముంబై ఇండియన్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఉన్నారు. మెగ్ లానింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం లీగ్ ప్రారంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తన నటనతో ప్రేక్షకులను అలరించారు. టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్, షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్ వంటి స్టార్స్ ప్రారంభ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు.
ముంబై ఇండియన్స్ టీమ్ ..
ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, జట్టులో అమంజోత్ కౌర్, ప్రియాంక బాలా, క్లో ట్రయాన్, హేలీ మాథ్యూస్, ఇస్సీ వాంగ్, జింటిమణి కలితా, నాట్ స్కివర్-బ్రంట్, హుమైరా ఖాజీ పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజ్నా, అమేలియా, కౌర్, ఫాతిమా జాఫర్, కీర్తనా బాలకృష్ణన్ ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు..
మెగ్ లానింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు జట్టులో స్నేహ దీప్తి, జెమిమా రోడ్రిగ్స్, అపర్ణ మండల్, లారా హారిస్, షఫాలీ వర్మ, అన్నాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, అశ్విని కుమారి, అలిస్ క్యాప్సీ, జెస్ జోనాస్సెన్, మారిజాన్ కప్ప్, మిన్ను మణి, రాధా యాదవ్, తానియా భాటియా, పూనమ్ భాటియా, యాదవ్, టిటాస్ సాధు, శిఖా పాండే ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..