Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు స్వర్ణం.. భారత్‌ అథ్లెట్స్‌లో వందేళ్ల కల సాకారమైన వేళ..

Neeraj Chopra: భారత జావెలిన్‌ థ్రో ప్లేయర్‌ నీరజ్‌ చోప్రా చరిత్రను తిరగరాశాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన నీరజ్‌ ఫైనల్‌లోనూ సత్తా చాటి భారత్‌కు పతకాన్ని సాధించి పెట్టాడు...

Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు స్వర్ణం.. భారత్‌ అథ్లెట్స్‌లో వందేళ్ల కల సాకారమైన వేళ..
Neeraj
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 07, 2021 | 6:18 PM

Neeraj Chopra: భారత జావెలిన్‌ థ్రో ప్లేయర్‌ నీరజ్‌ చోప్రా చరిత్రను తిరగరాశాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన నీరజ్‌ ఫైనల్‌లోనూ సత్తా చాటి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్‌కు చేరుకున్న నీరజ్‌ అద్భుతం సృష్టించాడు. దీంతో అథ్లెటిక్స్‌లో పతకం కోసం ఎదురు చూస్తోన్న భారత్‌ 100 ఏళ్ల కల నేడు సాకారమైంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌ 2020లో భారత్‌ పతకాల సంఖ్య 7కి చేరింది. గత ఒలింపిక్స్ లో ఆరు పతకాలు సాధించిన భారత్ ఇప్పుడు ఏడు పతకాలను సాధించింది.

హర్యానాలోని పానిపట్ లో జన్మించిన నీరజ్ చోప్రా అక్కడే పెరిగాడు. నీరజ్ ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్ గా పనిచేస్తున్నాడు. నీరజ్ చోప్రాలో 2018లో తన అత్యుత్తమ ప్రదర్శనను (88.06 మీటర్లను) సాధించాడు.  భారత చరిత్రలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్‌ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న క్రీడాకారుడిగా నిలిచాడు. ఇక మ్యాచ్ మొదటి నుంచే నీరజ్ దూకుడుగా రాణించాడు. మొదటి అవకాశంలోనే నీరజ్‌ 87.03 మీటర్లు విసిరాడు. 

నీరజ్ విజయదరహాసం..

టోక్యోలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.. ప్రధాని మోదీ.

జావెలిన్‌ త్రో లో స్వర్ణాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించిన నీరజ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. దేశ ప్రజలంతా నీరజ్‌ సాధించిన విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. టోక్యోలో సరికొత్త చరిత్ర లిఖించబడింది అంటూ వ్యాఖ్యానించిన మోదీ.. ‘ఈరోజు సాధించిన ఘనత ఎప్పటికీ గుర్తిండిపోతుంది. యువ ఆటగాడు నీరజ్‌ అద్భుత ఆటతీరును కనబరిచాడు. స్వర్ణం గెలుచుకున్నందుకు నీరజ్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు.

నీరజ్ గురించి కొన్ని విషయాలు..

నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997  డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో విద్యనభిసించాడు నీరజ్. ఇక చిన్నతనంలోనే ఇండియన్ ఆర్మీకి ఎంపికై నీరజ్. ఆటపై తనకున్న మక్కువను కొనసాగించాడు. నీరజ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో  నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్‌ గేమ్స్‌లో జావెలిన్‌ త్రో  ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్‌ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు. అనంతరం 2018లోనే జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలుచుకొని సంచలం సృష్టించాడు.

విజయం వరించిందిలా..

Also Read: Boxer Ritu : కడు పేదరికంలో యువ బాక్సర్.. పొట్టకూటి కోసం పార్కింగ్‌ టికెట్ల విక్రయం

Punjab Akali Dal leader: పంజాబ్‌ అకాలీ దళ్‌ యువనేత దారుణ హత్య.. 15 బుల్లెట్లు దించిన నలుగురు దుండగులు.

72 నిమిషాల బ్యాటింగ్.. ప్రశంసలతో డకౌట్‌గా పెవిలియన్‌కు.. ఆ ప్లేయర్ ఎవరు.? ఎందుకంటే!