72 నిమిషాల బ్యాటింగ్.. ప్రశంసలతో డకౌట్‌గా పెవిలియన్‌కు.. ఆ ప్లేయర్ ఎవరు.? ఎందుకంటే!
క్రికెట్ చాలా విచిత్రమైనది. మ్యాచ్ రూపురేఖలు ఎప్పుడు.? ఎలా.? మారతాయన్నది ఎవ్వరూ ఊహించలేరు. ఇలాంటి ఓ చిత్రమైన...
క్రికెట్ చాలా విచిత్రమైనది. మ్యాచ్ రూపురేఖలు ఎప్పుడు.? ఎలా.? మారతాయన్నది ఎవ్వరూ ఊహించలేరు. ఇలాంటి ఓ చిత్రమైన సంఘటన గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సాధారణంగా బ్యాట్స్‌మెన్ సెంచరీ చేసినా.. బౌలర్ ఐదు కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టినా.. వారు విజయంలో కీలక పాత్ర పోషించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తుంటారు. అయితే ఇక్కడొక ఆటగాడు 51 బంతులు ఎదుర్కుని డకౌట్‌గా వెనుదిరిగాడు. అతడు పెవిలియన్‌కు బాటపట్టినప్పుడు ప్రేక్షకులందరూ లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. అసలు ఆ మ్యాచ్ ఏంటి.? ఎవరు ఆ ఆటగాడు అన్నది తెలుసుకుందాం..
1999వ సంవత్సరం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 199 పరుగులు చేసింది. ఇందులో మార్క్ రాంప్రకాష్ అత్యధికంగా 69 పరుగులు చేశాడు. 227 బంతులు ఆడిన రాంప్రకాష్ అజేయంగా పదో నెంబర్ ఆటగాడితో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 10వ నెంబర్ బ్యాట్స్‌మెన్ పీటర్ సుచ్ 72 నిమిషాల పాటు క్రీజులో ఉండి 51 బంతులు ఎదుర్కుని డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ రాంప్రకాష్‌తో కలిసి 31 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఆ పరుగులు జట్టుకు కీలకమైనవి కావడంతో.. పీటర్ సుచ్ పోరాటపటిమకు స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు పీటర్‌ని చప్పట్లతో పెవిలియన్‌కు స్వాగతం పలికారు.
బౌలింగ్‌లో రాణించిన పీటర్ సుచ్…
మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 496 పరుగులు చేసింది. ఇందులో క్రెయిగ్ మెక్‌మిలన్ 107 పరుగుల చేయగా.. నాథన్ ఆస్టల్ 101 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో పీటర్ సుచ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడిన ఇంగ్లాండ్.. మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.