AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 1st Test Day 4 Highlights: ముగిసిన 4వ రోజు ఆట.. విజయానికి 157 పరుగుల దూరంలో టీమిండియా

India vs England 1st Test Day 4 Live Score: నాటింగ్‌హామ్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ సరిగ్గా కొనసాగడం లేదు.

IND vs ENG 1st Test Day 4 Highlights: ముగిసిన 4వ రోజు ఆట.. విజయానికి 157 పరుగుల దూరంలో టీమిండియా
Joe Root
Venkata Chari
|

Updated on: Aug 07, 2021 | 11:43 PM

Share

IND vs ENG 1st Test Day 4: నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది. టీమిండియా విజయానికి ఇంకా 157 పరుగులు కావాలి. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 52/1తో నిలిచింది. రోహిత్‌ శర్మ(12), పుజారా(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు కేఎల్‌ రాహుల్‌(26) ధాటిగా ఆడుతూ బ్రాడ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్‌ 34 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్‌ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ 5, అండర్సన్‌ 4 వికెట్లతో పడొట్టారు.

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. షమి వేసిన 85.5 ఓవర్‌కు రాబిన్‌సన్‌(15) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు.. సిరాజ్‌, శార్ధూల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా షమి ఒక వికెట్‌ తీశాడు. జో రూట్‌ (109) శతకంతో చెలరేగాడు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Aug 2021 11:34 PM (IST)

    14 ఓవర్లకు టీమిండియా స్కోర్ 52/1

    14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 52 పరుగులు చేసింది. రాహుల్ (26) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. రోహిత్(12), పుజారా(12)జోడీ పరుగులు రాబడుతూ నిలకడగా ఆడుతున్నారు.

  • 07 Aug 2021 11:24 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. స్కోర్ 40/1

    టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌(26) స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తీసుకొని కీపర్‌ చేతుల్లో పడటంతో 34 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ కోల్పోయింది. క్రీజులో రోహిత్ (9), పుజారా(4) పరుగులతో ఆడుతున్నారు.

  • 07 Aug 2021 10:24 PM (IST)

    ఇంగ్లండ్‌ 303 ఆలౌట్‌.. భారత లక్ష్యం 209

    ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ తొలి టెస్టులో గెలవాలంటే 209 పరుగులు సాధించాల్సి ఉంది. బౌలర్లలో బుమ్రా ఐదు.. సిరాజ్‌, శార్ధూల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా షమి ఒక వికెట్‌ తీశాడు. జో రూట్‌ (109) శతకంతో చెలరేగాడు.

  • 07 Aug 2021 10:11 PM (IST)

    తొమ్మిదవ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    బుమ్రా బౌలింగ్‌లో బ్రాడ్ తొమ్మిదవ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 303/9 పరుగుల వద్ద ఉంది. అలాగే ఆధిక్యం 208 పరుగులకు పెరిగింది.

  • 07 Aug 2021 09:48 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. జో రూట్‌ 107 పరుగులు ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 274 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ క్యాచ్ తీసుకున్నాడు. క్రీజులోకి ఓలి రాబిన్ సన్‌ వచ్చాడు. ఇంగ్లాండ్ భారత్ కంటే 186 పరుగుల ఆధిక్యం సాధించింది.

  • 07 Aug 2021 09:34 PM (IST)

    250 పరుగులు దాటిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ 6 వికెట్లు నష్టపోయి 270 పరుగులు దాటింది. భారత్ కంటే 175 పరుగుల ఆధిక్యం సాధించింది. మరోవైపు కెప్టెన్ జో రూట్ సెంచరీ సాధించి ఆట కొనసాగిస్తున్నాడు. అతడికి శామ్ కుర్రామ్ 22 పరుగులతో చక్కటి సహకారం అందిస్తున్నాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్, శార్థుల్‌ ఠాకూర్ రెండేసి వికెట్లు సాధించారు.

  • 07 Aug 2021 09:15 PM (IST)

    జో రూట్‌ సెంచరీ.. 157 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్..

    ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్‌ జో రూట్ సెంచరీ చేశాడు. 155 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. జో రూట్ సెంచరీతో ఇంగ్లాండ్ భారీ దిశగా వెళుతుంది. వరుసగా వికెట్లు పడుతున్నా రూట్ తన సహజ సిద్దమైన ఆటన ప్రదర్శించాడు. దీంతో ఇంగ్లాండ్ భారత్ కంటే 157 పరుగుల ఆధిక్యం సాధించింది. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతూ కెప్టెన్ రూట్‌కి సహకరిస్తూ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.

  • 07 Aug 2021 08:55 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ 17 పరుగులు ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 237 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్‌ జో రూట్96 పరుగులతో సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. శార్దుల్ ఠాకూర్ బట్లర్‌ని ఔట్ చేశాడు. శ్యామ్‌ కుర్రాన్ క్రీజులోకి అడుగుపెట్టాడు.

  • 07 Aug 2021 08:06 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ ఐదో వికెట్‌ కోల్పోయింది. డానియల్‌ లారెన్స్‌ 25 పరుగులు ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 211 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్‌ జో రూట్90 పరుగులతో సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. వరుసగా వికెట్లు లభించడంతో భారత బౌలర్లలో ఆనందం వెల్లివిరిసింది. జోస్‌ బట్లర్‌ క్రీజులోకి వచ్చాడు. ఠాకూర్‌ బౌలింగ్‌లో లారెన్స్ ఎల్బీగా వెనుదిరిగాడు.

  • 07 Aug 2021 07:59 PM (IST)

    200 పరుగులు దాటిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు దాటింది. కెప్టెన్ జో రూట్ 90 పరుగులతో కొనసాగుతున్నాడు. డానియల్‌ లారెన్స్‌ 17 పరుగులతో అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. భారత్ కంటే ఇంగ్లాండ్ ప్రస్తుతం 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్ రెండేసి వికెట్లు సాధించారు.

  • 07 Aug 2021 07:36 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ నాలుగో వికెట్‌ కోల్పోయింది. జానీ బెయర్‌ స్ట్రో 30 పరుగులు ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 177 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్‌ జో రూట్ 83 పరుగులతో సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. చాలా సమయం తర్వాత వికెట్‌ లభించడంతో భారత బౌలర్లలో ఆనందం వెల్లివిరిసింది. డానియల్‌ లారెన్స్‌ క్రీజులోకి వచ్చాడు. మహ్మద్‌ సిరాజ్‌కి మరో వికెట్‌ దక్కింది.

  • 07 Aug 2021 06:59 PM (IST)

    150 పరుగులు దాటిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు దాటింది. కెప్టెన్ జో రూట్ 76 పరుగులతో కొనసాగుతున్నాడు. జానీ బెయర్‌ స్ట్రో 12 పరుగులతో అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. భారత్ కంటే ఇంగ్లాండ్ ప్రస్తుతం 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, మహ్మద్‌ సిరాజ్ 1 వికెట్ సాధించారు.

  • 07 Aug 2021 06:40 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. సిబ్లీ 28 పరుగులు ఔట్ అయ్యాడు. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో రిషబ్‌ పంత్ క్యాచ్‌ పట్టాడు. దీంతో ఇంగ్లాండ్ 135 పరుగుల వద్ద 3 వికెట్‌ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్‌ జో రూట్ సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. చాలా సమయం తర్వాత వికెట్‌ లభించడంతో భారత బౌలర్లలో ఆనందం వెల్లివిరిసింది. జానీ బెయర్‌ స్ట్రో క్రీజులోకి వచ్చాడు.

  • 07 Aug 2021 06:18 PM (IST)

    ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం

    టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి స్వర్ణ పతకం దక్కింది. జావెలిన్ త్రోలో నీరజ్‌ చోప్రా గోల్డ్‌ మెడల్ సాధించాడు. 87.58 మీటర్ల త్రో విసిరి పతకం ఖాయం చేశాడు. అథ్లెటిక్స్‌లో భారతదేశానికి గోల్డ్‌ మెడల్ సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 2008 సంవత్సరంలో అభినవ్ బింద్రా దేశానికి మొదటి వ్యక్తిగత పతకాన్ని సాధించారు. బంగారు పథకం సాధించడంతో నీరజ్ చోప్రా గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి.

  • 07 Aug 2021 05:50 PM (IST)

    లంచ్‌ సమయానికి ఇంగ్లాండ్ 119/2.. కెప్టెన్ జో రూట్ హాఫ్ సెంచరీ..

    ఇంగ్లాండ్ లంచ్‌ సమయానికి 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 56 పరుగులు, సిబ్లే 27 పరుగులు చేశారు. మూడో వికెట్‌కి వీరిద్దరు 73 పరుగుల భాగస్వామ్యం చేశారు. మొదట్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు తర్వాత ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. భారత్ కంటే ఇంగ్లాండ్ ప్రస్తుతం 24 పరుగుల ఆధిక్యంలో ఉంది.

  • 07 Aug 2021 05:27 PM (IST)

    ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ హాఫ్ సెంచరీ..

    ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ హాఫ్ సెంచరీ చేశాడు. 71 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. దీంతో 2 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 118 పరుగులు చేసింది. మరోవైపు భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.

  • 07 Aug 2021 05:16 PM (IST)

    100 పరుగులు దాటిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్ 43 పరుగులు, డామ్‌ సిబ్లీ 25 పరుగులు నిలకడగా ఆడుతున్నారు. ఇద్దరు మూడో వికెట్‌కి 58 పరుగులు జోడించారు. మరోవైపు భారత బౌలర్లు వికెట్ల కోసం చెమటోడ్చుతున్నారు.

  • 07 Aug 2021 04:51 PM (IST)

    ధాటిగా ఆడుతున్న కెప్టెన్ జో రూట్

    ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ధాటిగా ఆడుతున్నాడు. మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆట కొనసాగిస్తున్నారు. 37 బంతుల్లో 6 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. మరోవైపు డామ్‌ సిబ్లీ 22 పరుగులు చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.

  • 07 Aug 2021 04:08 PM (IST)

    50 పరుగులు దాటిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో డామ్‌ సిబ్లీ 17 పరుగులు, జో రూట్ 4 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. ఇండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బూమ్రా చెరో వికెట్ సాధించారు.

  • 07 Aug 2021 04:02 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. జాక్ క్రాలే ఔట్..

    ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో జాక్ క్రాలే 6 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.

  • 07 Aug 2021 03:52 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ 37 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్ రోరీ బర్న్స్‌ 18 పరుగులు ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రిషబ్‌ పంత్ చక్కటి క్యాచ్ పట్టాడు.

  • 07 Aug 2021 03:44 PM (IST)

    కొనసాగుతున్న మ్యాచ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 37/0

    భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ 4వ రోజు ఆట కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రోరీ బర్న్స్‌ 18 పరుగులు, డామ్‌ సిబ్లీ 13 పరుగులు ఆడుతున్నారు.

  • 07 Aug 2021 03:21 PM (IST)

    మరికొద్దిసేపట్లో ఆట ప్రారంభం..

    భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకి వర్షం అంతరాయం కలిగిస్తోంది. అయితే 4వ రోజు ఆట మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది.

Published On - Aug 07,2021 3:00 PM