AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Akali Dal leader: పంజాబ్‌ అకాలీ దళ్‌ యువనేత దారుణ హత్య.. 15 బుల్లెట్లు దించిన నలుగురు దుండగులు.

Punjab Akali Dal leader: పంజాబ్‌లో శనివారం దారుణం జరిగింది. పంజాబ్‌ మోహాలీ ప్రాంతానికి చెందిన అకాలీ దల్‌ యువనేత విక్రమ్‌జిత్‌ సింగ్‌ మిద్దుఖెరాను గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా...

Punjab Akali Dal leader: పంజాబ్‌ అకాలీ దళ్‌ యువనేత దారుణ హత్య.. 15 బుల్లెట్లు దించిన నలుగురు దుండగులు.
Attack On Akali Dal Leader
Narender Vaitla
|

Updated on: Aug 07, 2021 | 3:50 PM

Share

Punjab Akali Dal leader: పంజాబ్‌లో శనివారం దారుణం జరిగింది. పంజాబ్‌ మోహాలీ ప్రాంతానికి చెందిన అకాలీ దల్‌ యువనేత విక్రమ్‌జిత్‌ సింగ్‌ మిద్దుఖెరాను గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం సెక్టర్‌ 71లోని ఓ రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసుకు వెళ్లిన విక్రమ్‌ జిత్‌ తిరుగు ప్రయాణంలో భాగంగా తన కారులోకి ఎక్కుతోన్న సమయంలో ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఇద్దరు ఫైర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత విక్రమ్‌ జిత్‌ ఏకంగా హాఫ్‌ కిలోమీటర్‌ పరిగెత్తాడు కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో సెక్టర్‌ 71లోని కమ్యునిటీ సెంటర్‌ వద్ద కుప్పకూలిపోయాడు.

విక్రమ్‌ జిత్‌పై ఏకంగా 15 బుల్లెట్లు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. నిందితులను గుర్తించేందుకు గాను సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు. యువనేత హత్య జరిగిందన్న వార్త వినగానే ఎస్‌ఎస్‌పీ సతిందర్‌ సింగ్‌, డీఎస్‌పీ, ఎస్‌పీ వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ఇక హత్యకు గురైన విక్రమ్‌ కారులో లైసెన్స్‌ కూడిన రివాల్వర్‌ ఉందని గుర్తించిన పోలీసులు.. కానీ అతను దానిని ఉపయోగించేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని, కారును సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే విక్రమ్‌ జిత్‌ పంజాబ్‌ యూనివర్సిటీలో స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌లో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. అనంతరం విక్రమ్‌ శిరోమణి అకాలీ దళ్‌ పార్టీలో విద్యార్థి విభాగంలో చేరాడు. విక్రమ్‌ సోదరుడు అజయ్‌ మిద్దుఖేరా ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో మొహాలీ మాజీ మేయర్ కుల్వంత్ సింగ్ కుమారుడిపై పోటీ చేశారు.

Also Read: Kadapa Double Murders Story: కడప జిల్లా డి నేలటూరు డబుల్ మర్డర్స్ కేసులో విస్తుపోయే విషయాలు.!

Simhachalam Lands Issue: సింహాచలం భూ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

కర్నాటకలో సెల్ ఫోన్స్ కంటైనర్ చోరీ.. 6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు..