Bajrang Punia: దుమ్మురేపిన భజరంగ్.. భారత్ ఖాతాలో మరో పతకం.. కాంస్యంతో అదరగొట్టిన..
Bajrang Punia: భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భజరంగ్ పునియా రెజ్లింగ్ కాంస్యం కోసం జరిగిన పోరులో విజయం సాధించాడు. కజకిస్థాన్ ప్లేయర్‌పై మొదటి నుంచి దూకుడుగా ఆడి విజయాన్ని...

Bajrang Punia: భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భజరంగ్ పునియా రెజ్లింగ్ కాంస్యం కోసం జరిగిన పోరులో విజయం సాధించాడు. కజకిస్థాన్ ప్లేయర్‌పై మొదటి నుంచి దూకుడుగా ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో గెలిచాడు టాప్ రెజ్లర్ బజరంగ్ పునియా. ఈ కాంస్యంతో.. ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది. వీటిలో 2 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.
కజకిస్థాన్‌కు చెందిన నియాజ్బెకోవ్ దౌలెత్ను 8-0 తేడాతో చిత్తుచేశాడు బజరంగ్. సాంకేతికంగా ఒక్క తప్పు కూడా చేయకుండా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్‌ను గెలిచాడు. రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ కొట్టిన దౌలత్.. ఈ మ్యాచ్‌లో భజరంగ్‌కు గట్టి పోటీనిచ్చినప్పటికీ చివరకు భజరంగ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. భజరంగ్ తొలి ఒలింపిక్స్‌లోనే కాంస్యాన్ని గెలుచుకోవడం విశేషం. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో దేశానికి పతకం అందించిన ఆరో రెజ్లర్‌గా భజరంగ్ నిలిచాడు. ఇదే ఒలింపిక్స్‌లో రవి కుమార్ దహియా రజతం గెలవగా.. తాజాగా భజరంగ్ కాంస్యం గెలిచాడు. ఇంతకముందు కేడీ జాదవ్(కాంస్యం), సుశీల్ కుమార్ (కాంస్యం, రజతం), సాక్షి మాలిక్( కాంస్యం), యేగేశ్వర్ దత్( కాంస్యం), రవి దహియా(రజతం) గెలిచారు.
మోదీ శుభాకాంక్షలు..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించిన భజరంగ్ పునియాకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకంక్షలు తెలిపారు. టోక్యో 2020 నుంచి మంచి వార్త వచ్చిందని అభివర్ణించిన మోదీ.. భజరంగ్ సాధించిన విజయం దేశానికి గౌరవాన్ని, సంతోషాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు.
Delightful news from #Tokyo2020! Spectacularly fought @BajrangPunia. Congratulations to you for your accomplishment, which makes every Indian proud and happy.
— Narendra Modi (@narendramodi) August 7, 2021
Also Read: Viral Video: ఎరక్కపోయి వెళ్లాడు.. ఏటీఎంలో ఇరుక్కుపోయాడు.. ఈ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు




