Cricket: ఆ రోజు భారత్- పాక్ మ్యాచ్ టికెట్లు మొత్తం సేల్.. చివరికి అవి కూడా.. ఐసీసీ కీలక ప్రకటన..

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న T20 ప్రపంచ కప్ కు సమయం సమీపిస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో ఈటోర్నమెంట్ జరగనుంది. అయితే ఎన్ని మ్యాచ్ లు జరుగుతున్నా.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్..

Cricket: ఆ రోజు భారత్- పాక్ మ్యాచ్ టికెట్లు మొత్తం సేల్.. చివరికి అవి కూడా.. ఐసీసీ కీలక ప్రకటన..
India Vs Pakistan Asia Cup
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 15, 2022 | 1:55 PM

Cricket: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న T20 ప్రపంచ కప్ కు సమయం సమీపిస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో ఈటోర్నమెంట్ జరగనుంది. అయితే ఎన్ని మ్యాచ్ లు జరుగుతున్నా.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆకిక్కే వేరు. క్రికెట్ అభిమానులంతా భారత్-పాక్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తు ఉంటారు. ఈమ్యాచ్ ను గ్రౌండ్ లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు పోటీపడతారు. ఇప్పటికే T20 ప్రపంచ కప్ టికెట్ల విక్రయాలను ICC ప్రారంభించింది. అయితే భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అక్టోబర్ 23వ తేదీకి టికెట్లు మొత్తం సేల్ అయిపోయాయని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. చివరికి అదనపు స్టాండింగ్‌ రూం టికెట్లు కూడా నిమిషాల్లో అమ్ముడుపోయినట్లు పేర్కొంది. అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 13 వ తేదీ వరకు ఈటోర్నమెంట్ జరగనుండగా.. ఈ టోర్నీకి ఇప్పటి వరకు ఐదు లక్షల టికెట్లను విక్రయించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ టోర్నమెంట్‌ సూపర్‌ 12 దశలో అక్టోబర్‌ 23న భారత్‌-పాక్‌ తలపడనున్నాయి. ఈమ్యాచ్ టికెట్ల సేల్ ప్రారంభించిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

మొత్తం 82 దేశాల నుంచి అభిమానులు ఈ టోర్నమెంట్‌ను వీక్షించేందుకు హాజరుకానున్నారు. మొత్తం 16 జట్లకు చెందిన అత్యున్నత ఆటగాళ్లు ఈమెగా టోర్నమెంట్ లో పాల్గొననున్నారు. 2020 మహిళల ప్రపంచ కప్‌ తర్వాత తొలిసారి మైదానాల్లో పూర్తి సామర్థ్యం మేరకు అభిమానులను ఈటోర్నికి అనుమతిస్తుండటంతో క్రికెట్ అభిమానులు నేరుగా మ్యాచ్ ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. MCG మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్ ను 86,174 మంది వీక్షించనున్నారు. అదే మైదానంలో అక్టోబర్‌ 23న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టికెట్లు, అడిషనల్‌ స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లు మొత్తం సేల్ అయిపోయాయి. అయితే టోర్నీకి ముందు అధికారికంగా టికెట్ల రీసేల్‌ విక్రయ వేదికను ప్రారంభిస్తారు. అక్కడ అభిమానులు అసలు ధరకు టికెట్లను మార్చుకోవచ్చు అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్‌ 22వ తేదీన జరిగే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్