Paris Olympics 2024: శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిందే ఫాలో అయ్యా.. అందుకే ఒలింపిక్స్ లో పతకం కొట్టా ..హర్యానా క్రీడా కుసుమం
హర్యానా బాక్సర్లు, మల్లయోధులకు ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రం నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రపంచ వ్యాప్తంగా మన దేశ జాతీయ జెండాను ఎగురవేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నారు. షూటింగ్ గర్ల్ మను భాకర్ కూడా ఇదే రాష్ట్రం నుంచి వచ్చి ఆదివారం అంటే జూలై 28న మళ్లీ దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసేలా జాతీయ జెండాను ఎగురవేసింది
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న మను భాకర్ చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన 22 ఏళ్ల యువతి పారిస్ క్రీడల్లో ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఛటౌరోక్స్ షూటింగ్ సెంటర్‌లో మహిళల పిస్టల్ 10 మీటర్ల షూటింగ్ విభాగంలో 221.7 స్కోరుతో మను భాకర్ ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచింది.
మను తన మొదటి ఐదు షాట్‌ల్లో 50.4 స్కోర్ చేసి మొత్తం ర్యాంకింగ్స్‌లో 2వ స్థానాన్ని పొందింది. కష్టతరమైన ఫైనల్‌లో.. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ యెజీ , ఓహ్ యే జిన్ లు మొదటి రెండు స్థానాలను పంచుకోవడంతో భారత షూటర్ అయిన మను చివరికి మూడో స్థానంలో నిలిచింది.
ఓహ్ యే జిన్ 243.2 స్కోరుతో బంగారు పతకాన్ని గెలుచుకుని సరి కొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించింది. కిమ్ యెజీ 241.3 పాయింట్లతో రజతంతో సరిపెట్టుకుంది. సుమా షిరూర్ (2004) తర్వాత ఒలింపిక్ షూటింగ్‌లో వ్యక్తిగత ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ మహిళ మను భాకర్. ఇప్పుడు కాంస్య పతకం గెలిచి ఈ క్రీడలో భారతదేశం 12 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఎదురు చూపుకు తెరదించింది.
2012 లండన్ ఒలింపిక్స్‌లో గగన్ నారంగ్ కాంస్య పతకం సాధించిన తర్వాత షూటింగ్‌లో భారత్‌కు కాంస్య పతకం దక్కడం ఇదే తొలిసారి. తొలి ఒలింపిక్ పతకాన్ని కైవసం చేసుకున్న తర్వాత మను భాకర్ మాట్లాడుతూ శ్రీ కృష్ణుడు, భగవద్గీత నుంచి నేర్చుకున్న పాఠాలు తనకు ఎంతగానో ఉపయోగ పడ్డాయని.. ఫైనల్‌లో తన ఉద్వేగాన్ని అదుపులో ఉంచేలా చేసి తనని శాంతపరిచాయని చెప్పింది. కృష్ణుడు, భగవద్గీత నుంచి నేర్చుకున్న విషయాలు ఈ ఒలంపిక్స్ లో భారత దేశానికి మొదటి పతకాన్ని అందించేలా చేశాయని మను భాకర్ వెల్లడించింది.
మను భాకర్ కాంస్యం గెలవడానికి గీత నుండి పాఠాలు ఎలా సహాయపడాయి
ఫైనల్ లో ముగింపు సమయంలో తన మనస్సులో సంఘర్షణ జరుగుతుండగా అప్పుడు తనకు భగవద్గీత గుర్తుకొచ్చిందని వెల్లడించింది. మహాభారత సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న తాను ఫలితం మీద కాక ప్రక్రియపై మాత్రమే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. “కర్మ కరో ఫల్ కి చింతా మత్ కరో (ఫలితాలపై కాకుండా మీ కర్మపై దృష్టి పెట్టండి)” అని శ్రీకృష్ణుడు మహాభారత సమయంలో అర్జునుడికి చెప్పాడు. గీతలోని శ్రీకృష్ణుడి మాటలను ఉదహరిస్తూ.. ఫైనల్ సమయంలో తాను ఫలితం గురించి చింతించలేదని.. తన ‘కర్మ’పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది.
“గీతను చాలా సార్లు చదివాను. మీరు చేయవలసిన పనిని చేసి వదిలివేయండి, మీరు విధిని నియంత్రించలేరు, మీరు ఫలితాన్ని నియంత్రించలేరు అన్నది తనకు బాగా ఇష్టమని చెప్పింది. గీతలో కృష్ణుడు అర్జునుడితో నీ కర్మపై దృష్టి పెట్టు.. కర్మ ఫలితంపై కాదు. ఈ విషయం మాత్రమే తన మనసులో ఉందని తెలిపింది.
You’ve truly made us proud! ❤️
Manu Bhaker has made history by clinching India’s first medal at #Paris2024! 🇮🇳 Watch more Olympic action live on #Sports18 & stream for FREE on #JioCinema! 👈#OlympicsonJioCinema #OlympicsonSports18 #Cheer4Bharat #JioCinemaSports pic.twitter.com/qQlE8ZEJ2x
— JioCinema (@JioCinema) July 28, 2024
పారిస్ గేమ్స్‌లో భారతదేశానికి మొదటి పతకం సాధించడం తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని “టీమ్ మొత్తం చాలా కష్టపడి పనిచేసింది. వ్యక్తిగతంగా తనకు ఇది అధివాస్తవిక భావన. మంచి పని చేశానని భావిస్తున్నాను. చివరి షాట్ వరకు కూడా తనలో ఉన్న శక్తిన ఉపయోగించి పోరాడాను. ఇది కాంస్యం అయితేనేమి భారత్‌కు కాంస్యం సాధించగలిగినందుకు చాలా గర్వంగా ఉంది. దేవుడికి కృతఙ్ఞతలు అని చెప్పారు.
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, అభినవ్ బింద్రా, విజయ్ కుమార్, గగన్ నారంగ్ తర్వాత ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న ఐదవ భారత షూటర్‌గా మను నిలిచింది. పారిస్‌లో జరిగే మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో జతకట్టిన మను ఇప్పుడు మరో పతకంపై కన్నేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..