AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: నిన్ను చూసి దేశం గర్విస్తోంది.. కాంస్య పతకం సాధించిన మనుని అభినందించిన ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ ముర్ము

“పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకంతో భారతదేశాన్ని పతకాల పట్టికలో నిలిపి ఖాతా తెరిచినందుకు మను భాకర్‌కు హృదయపూర్వక అభినందనలని చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన మను భాకర్ ను చూసి భారతదేశం గర్విస్తోంది.

Paris Olympics 2024: నిన్ను చూసి దేశం గర్విస్తోంది.. కాంస్య పతకం సాధించిన మనుని అభినందించిన ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ ముర్ము
Pm Modi Congrats ManuImage Credit source: twitter
Surya Kala
|

Updated on: Jul 28, 2024 | 9:04 PM

Share

పారిస్ ఒలింపిక్స్ 2024లో పారిస్‌లోని చటౌరోక్స్ షూటింగ్ సెంటర్‌లో ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో భారత్ ఖాతా తెరచింది. దీంతో మనుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. మను భాకర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

8 మంది మహిళలు పాల్గొన్న ఫైనల్ ఈవెంట్‌లో 22 ఏళ్ల మను మొత్తం 22 షాట్లలో 221.7 స్కోర్ చేసి మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా ద్వయం ఓహ్ యే జిన్ (243.2), కిమ్ యేజీ (241.3) స్వర్ణం, రజత పతకాలను సాధించారు. అంతేకాదు ఓహ్ యే జిన్ సరికొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పింది. మూడేళ్ల క్రితం టోక్యో వేదికగా రష్యా షూటర్ విటాలినా బత్సరాష్కినా (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో 240.3) సాధించిన రికార్డును బీట్ చేసింది. ఈ క్రీడలో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన దేశం నుంచి తొలి మహిళా షూటర్‌గా నిలిచిన హర్యానా అథ్లెట్ మనును ప్రధాని మోడీ ప్రశంసించారు.  మను కి స్వయంగా ఫోన్ చేసిన ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

“పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకంతో భారతదేశాన్ని పతకాల పట్టికలో నిలిపి ఖాతా తెరిచినందుకు మను భాకర్‌కు హృదయపూర్వక అభినందనలని చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన మను భాకర్ ను చూసి భారతదేశం గర్విస్తోంది. ఆమె ఫీట్ చాలా మంది క్రీడాకారులకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులో మను మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నానని మనుపై రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు.

చారిత్రాత్మకమైన కాంస్య పతకంమను భాకర్ గర్వంతో మెరిశాడు

మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు చేరుకోవడంలో మను భాకర్ విఫలం అయింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆయుధం పనిచేయకపోవడాన్ని ఆమె భరించింది. ఈ వేసవి ఒలింపిక్స్ లో భారత్ ఆశాకిరణంగా పారిస్ లో అడుగు పెట్టింది. తన ‘కల నిజమైంది’ క్షణాన్ని అనుభవించడానికి ఉల్లాసంగా పోడియంపైకి వచ్చింది.

మను భాకర్ మెడల్ వేడుక వీడియో ఇక్కడ ఉంది:

మను పారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి పోటీపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి