AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolate Face Mask: చాక్లెట్స్ ను చకచకా తినేయ్యకండి.. మచ్చలు పోవడానికి ముఖానికి ఇలా అప్లై చేసి చూడండి..

చాక్లెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. దీనితో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో కూడా డార్క్ చాక్లెట్‌ మాస్క్ మంచి సహాయకారిగా ఉంటుంది. చాక్లెట్ ఫేస్ మాస్క్ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపదుతుంది. ఇంట్లో చాక్లెట్స్ కు మరికొన్ని పదార్ధాలను కలపడం ద్వారా బెస్ట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవచ్చు.

Chocolate Face Mask: చాక్లెట్స్ ను చకచకా తినేయ్యకండి.. మచ్చలు పోవడానికి ముఖానికి ఇలా అప్లై చేసి చూడండి..
Natural Beauty Care Tips
Surya Kala
|

Updated on: Jul 28, 2024 | 6:18 PM

Share

చర్మం మెరిసిపోయి ఆరోగ్యంగా ఉండేందుకు ఇంట్లో లభించే అనేక రకాల ఉత్పత్తులు, అనేక సహజసిద్ధమైన పదార్థాలను ముఖంపై అప్లై చేస్తారు. అయితే కొంతమంది మార్కెట్‌లో రెడీమేడ్ చాక్లెట్ మాస్క్‌లను మిక్స్ చేసి అప్లై చేస్తారు. అయితే ఇంట్లోనే తయారుచేసుకుని చాక్లెట్ మాస్క్‌లను అప్లై చేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. దీనితో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో కూడా డార్క్ చాక్లెట్‌ మాస్క్ మంచి సహాయకారిగా ఉంటుంది.

చాక్లెట్ ఫేస్ మాస్క్ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపదుతుంది. ఇంట్లో చాక్లెట్స్ కు మరికొన్ని పదార్ధాలను కలపడం ద్వారా బెస్ట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవచ్చు.

కోకో పౌడర్ – తేనె: ఈ పేస్ట్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేయండి. దీని తర్వాత 1 చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిని జోడించండి. ఈ మూడు వస్తువులను కలపడం ద్వారా మెత్తని పేస్ట్‌ను సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల ఉంచుకుని.. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

కోకో పౌడర్‌-కాఫీ పౌడర్‌: మొటిమలపై చాక్లెట్ ను ఫేస్ మాస్క్‌ను అప్లై చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా సహజసిద్ధమైన కోకో పౌడర్‌ని తీసుకుని, అందులో సమాన పరిమాణంలో కాఫీ పౌడర్‌ను కలపాలి. దీని తర్వాత మీరు అందులో పాలు లేదా కొబ్బరి నూనెను జోడించవచ్చు. వీటన్నింటినీ బాగా కలపండి.. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 0 నుండి 20 నిమిషాలు ఉంచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

చాక్లెట్- అరటి పండు: చాక్లెట్, అరటిపండు ఫేస్ మాస్క్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 పండిన అరటిపండు, 1 టేబుల్ స్పూన్ తేనె అవసరం. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా అరటిపండ్లను ఒక గిన్నెలో వేసి దానిని మెత్తగా చేయండి. ఇప్పుడు కోకో పౌడర్, తేనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

చాక్లెట్- ఓట్ మీల్: ఈ పేస్ట్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ (సన్నగా మెత్తగా), 1 టేబుల్ స్పూన్ పాలు లేదా బాదం పాలు అవసరం. ఈ ఫేస్ ప్యాక్ తయారీకి ముందుగా ఒక గిన్నెలో కోకో పౌడర్, గ్రౌండ్ వోట్మీల్ తీసుకోండి. దీని తర్వాత ఈ మిశ్రమానికి కొద్దిగా పాలు జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి 15 నుండి 20 నిమిషాలు ఉంచాలి. దీని తరువాత దీనిని తొలగించడానికి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)