Festivals in August: ఆగస్ట్ నెలలో మంగళ గౌరీ వ్రతం, రక్షా బంధన్ నుంచి జన్మాష్టమి వరకు, పూర్తి వివరాలు మీ కోసం
శ్రావణ మాసం ఆగష్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 3వ తేదీ వరకూ కొనసాగుతుంది. అనేక ప్రధాన పండుగలు ఈ మాసంలో వస్తాయి. శ్రావణ మాసంలో శివుడిని పూజిస్తారు. శివ భక్తులు భోలేనాథ్‌ను ప్రసన్నం చేసుకోవడానికి అనేక పూజలు చేస్తారు. అదే సమయంలో శ్రావణ శుక్రవారాలు,మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మిదేవిని, పార్వతీ దేవికి అంకితం చేసిన మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు. అంతేకాదు రక్షాబంధన్, నాగపంచమి వంటి పండుగలు ఆగస్టు నెలలో జరుపుకుంటారు.
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆగస్ట్ నెల చాలా పండుగలను తీసుకువస్తోంది. ఈ నెలలో శ్రావణ మాసం పవిత్ర మాసం.. కనుక శుభకార్యాలకు, పండగలు, పర్వదినాలకు ముఖ్యమైన మాసం. మరికొద్ది రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుంది. అదే సమయంలో శ్రావణ మాసం ఆగష్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 3వ తేదీ వరకూ కొనసాగుతుంది. అనేక ప్రధాన పండుగలు ఈ మాసంలో వస్తాయి. శ్రావణ మాసంలో శివుడిని పూజిస్తారు. శివ భక్తులు భోలేనాథ్‌ను ప్రసన్నం చేసుకోవడానికి అనేక పూజలు చేస్తారు. అదే సమయంలో శ్రావణ శుక్రవారాలు,మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మిదేవిని, పార్వతీ దేవికి అంకితం చేసిన మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు. అంతేకాదు రక్షాబంధన్, నాగపంచమి వంటి పండుగలు ఆగస్టు నెలలో జరుపుకుంటారు.
ఆగస్టు 2024 వ్రతాల జాబితా
త్వరలో ప్రారంభం కానున్న ఆంగ్ల క్యాలెండర్‌లో ఆగస్టు ఎనిమిదో నెల. హిందూ మతపరమైన దృక్కోణంలో ఆగష్టు నెల మొత్తం ఉపవాసాలు, పండుగలతో నిండి ఉంటుంది. అందుకే ఆగస్టు నెలను ముఖ్యమైనదిగా భావిస్తారు. ఆగస్ట్‌లో వచ్చే ఉపవాసాలు, పండుగలు ఏమిటి? వాటి తేదీలు ఏమిటో తెలుసుకుందాం..
ఆగస్ట్ 2024 నెలలో వచ్చే ప్రముఖ పండగలు, పర్వదినాలు
- ఆగష్టు 5, సోమవారం:- శ్రావణ సోమవారం
- 6 ఆగస్టు, మంగళవారం:- మంగళ గౌరీ వ్రతం
- ఆగష్టు 7, బుధవారం:- హరియాలి తీజ్, స్వర్ణ గౌరీ వ్రతం
- ఆగస్టు 8, గురువారం:- సంకష్ట హర వినాయక చతుర్థి
- ఆగష్టు 9, శుక్రవారం:- నాగ పంచమి
- 10 ఆగస్టు, శనివారం:- కల్కి జయంతి
- 11 ఆగస్టు, ఆదివారం:- తులసీదాస్ జయంతి
- 12 ఆగస్టు, సోమవారం:- శ్రావణ సోమవారం ఉపవాసం,
- 13 ఆగస్టు, మంగళవారం:-రెండవ శ్రావణ మంగళ గౌరీ వ్రతం, దుర్గాష్టమి.
- 16 ఆగస్ట్ , శుక్రవారం:- శ్రావణ పుత్రదా ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం
- 17 ఆగష్టు, శనివారం:- శని ప్రదోష వ్రతం
- 19 ఆగస్టు, సోమవారం:-శ్రావణ సోమవారం .. జంద్యాల పౌర్ణమి, రక్షాబంధన్
- 22 ఆగస్టు, శుక్రవారం:- శ్రావణ శుక్రవారం మూడో వరలక్ష్మి వ్రతం
- 26 ఆగస్టు 2024, సోమవారం – శ్రీ కృష్ణ జన్మాష్టమి
- 27 ఆగస్టు 2024, మంగళవారం – శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం
- 29 ఆగస్టు 2024, గురువారం – అజ ఏకాదశి
- 30 ఆగస్టు, శుక్రవారం:- నాలుగో వరలక్ష్మి వ్రతం
- 31 ఆగస్టు 2024, శనివారం – ప్రదోష వ్రతం
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు