Corona Cases: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలో కరోనా కలకలం.. హోటల్ గదులకే పరిమితమైన క్రీడాకారులు..
Shooters Test Corona Positive: తాజాగా కరోనా ప్రభావం ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నీపై పడింది. ఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ఒక్కసారిగా కరోనా కలకలం రేపింది...
Shooters Test Corona Positive: గతేడాది ప్రపంచాన్ని భయపెట్టించిన కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోందని అందరూ సంతోషిస్తున్నారు. వ్యాక్సినేషన్ కూడా అందబాటులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో ఒక్కసారిగా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తుండడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా ప్రభావం ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నీపై పడింది. ఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ఒక్కసారిగా కరోనా కలకలం రేపింది. టోర్నీకి హాజరైన ముగ్గురు షూటర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అంతా అలర్ట్ అయ్యారు. మిగతా షూటర్లంతా హోటల్ గదులకు పరిమితమై ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఇఫ్ ఇండియా వర్తాలు అధికారికంగా తెలిపాయి. ఇక కోవిడ్-19 బారిన పడిన షూటర్లతో సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురు క్రీడాకారులు సైతం పరీక్షలు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ బారిన పడిన ముగ్గురిలో ఇద్దరు భారతీయ క్రీడాకారులనేనని తెలిపారు. మరి ఈ పరిస్థితుల్లో టోర్నీని కొనసాగిస్తారా.? లేదా అందరికీ పరీక్షలు చేయించాకా మళ్లీ మొదలు పెడతారా.? అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ప్రపంచకప్‌లో భారత షూటర్లు దివ్యాంశ్ సింగ్ పన్వర్, అర్జున్ బబుతా తమ ఆటతీరుతో సత్తాచాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ ఇద్దరూ ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన 60 షాట్ల క్వాలిఫికేషన్ రౌండ్‌లో 631.8 పాయింట్లతో అర్జున్ మూడో స్థానం, 629.1 పాయింట్లతో పన్వర్ ఆరో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఇదిలా ఉంటే పన్వర్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా సాధించడం విశేషం.