India vs England 5th T20 Match: మెతేరాలో మోత మోగించిన భారత్.. ఐదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా..
India vs England 5th T20 Match: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. నరేంద్రమోదీ స్టేడియంలో పరుగుల వరద కురిపించిన భారత్.. బౌలింగ్ విభాగంలోనూ రాణించడంతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది...
India vs England 5th T20 Match: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. నరేంద్రమోదీ స్టేడియంలో పరుగుల వరద కురిపించిన భారత్.. బౌలింగ్ విభాగంలోనూ రాణించడంతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. చావో రేవో అన్నట్లు సాగిన మ్యాచ్‌లో కోహ్లి సేన విజయ దుందుభి మోగించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను కేవలం 188/8 పరుగులకే పరిమితం చేసింది. ఇంగ్లాండ్ జట్టులో కేవలం జోస్ బట్లర్ (52), డేవిడ్ మలన్ (68) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్‌ను సాధించగా మిగతా వారు వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. దీంతో 3-2తో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మలన్, బట్లర్ భారీ స్కోరుతో దూసుకెళుతోన్న సమయంలో టీమిండియా ఓడిపోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వీరిద్దరూ భారీ సిక్సర్లు, బౌండరీలతో హోరెత్తించడంతో ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేధిస్తుందా అన్ని ప్రశ్నలు తలెత్తాయి. అయితే అదే సమయంలో బౌలింగ్ తీసుకున్న భువనేశ్వర్ ఇంగ్లాండ్ బట్లర్, మలన్ భాగస్వామ్యాన్ని దెబ్బతీశాడు. అనంతరం కేవలం 10 పరుగులకే బెయిన్ స్టోక్‌ను శార్దుల్ అవుట్ చేశాడు. మరో 2 పరుగులకే మలన్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. అనంతరం వెనువెంటనే మోర్గాన్ 1 పరుగుకే వెనుదిరిగాడు. దీంతో ఇలా వరుస వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ ఒక్కసారిగా ఢీలా పడింది. రన్ రేట్ తగ్గడం, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలోకి వెళ్లడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖారారైంది. ఇక అంతకుముందు బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియా మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఇంగ్లాండ్ పేసర్లను భారత ఓపెనర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ 64 పరుగులు, కోహ్లీ 80 పరుగులతో విరుచుకుపడడంతో టీమిండియా స్కోర్ జట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లింది. ఇక సూర్య కుమార్ 32 పరుగులు, హార్దిక్ పాండ్యా 39 పరుగులు సాధించడంతో భారీ స్కోరును నమోదు చేశారు. ఇంగ్లాండ్ ముందు 224/4 లక్ష్యాన్ని ఉంచారు. ఇంగ్లాండ్‌పై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
Also Read: లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్.. ఆ యువతి గురించి ఏం చెప్పాడో తెలిస్తే షాక్..