India vs England 5th T20 : దుమ్ము లేపిన కోహ్లీ సేన.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం.. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ..
India vs England 5th T20 : భారత్- ఇంగ్లాండ్ ఐదు టీ ట్వంటీ సిరీస్‌లో భాగంగా.. ఈ రోజు అహ్మదాబాద్‌లో ఐదో మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి
India vs England 5th T20 : భారత్- ఇంగ్లాండ్ ఐదు టీ ట్వంటీ సిరీస్‌లో భాగంగా.. ఈ రోజు అహ్మదాబాద్‌లో ఐదో మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. 52 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 34 బంతుల్లో 64 పరుగులు చేసి ఓపెనర్లుగా తమ బాధ్యత నిర్వర్తించారు. హార్దిక్ పాండ్య 39 పరుగులతో విరాట్ కోహ్లీకి జత కలిసాడు. చివర్లో వేగంగా ఆడటం వల్ల భారత్ 200 పరుగులు దాటింది. కేవలం 17 బంతుల్లో నాలుగు ఫోర్లు , రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. సూర్యకుమార్ 37 పరుగులు చేశాడు. బౌండరీ లైన్ వద్ద జోర్డాన్ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ ఇంగ్లాండ్ ముందు 225 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. కాగా ఇంగ్లాండ్‌పై భారత్‌కి ఇదే అత్యధిక స్కోరు.